Rain Alert: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం..
అటెన్షన్ ఏపీ.. వచ్చే మూడు రోజులు వర్షాలు బీభత్సం సృష్టించబోతున్నాయి. భారీ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. మోంథా తుఫాన్ ముప్పుతో.. రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారులను అప్రమత్తం చేశారు.

అటెన్షన్ ఏపీ.. వచ్చే మూడు రోజులు వర్షాలు బీభత్సం సృష్టించబోతున్నాయి. భారీ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. మోంథా తుఫాన్ ముప్పుతో.. రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా బలపడింది. ఇది ఆదివారం తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతం అయి.. గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.. రేపు తీవ్ర వాయుగుండంగా.. తుఫాన్‌గా బలపడనుంది.. ఎల్లుండి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. అదే రోజు రాత్రి తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తుఫాన్‌కు మొంథాగా నామకరణం చేసింది.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేశారు.
తుఫాన్ ప్రభావం, తీవ్రతపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
కాగా.. మోంథా తుఫాన్ ప్రభావం, తీవ్రతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు. మొంథా తుఫాన్ సన్నాహక చర్యల పర్యవేక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతోపాటు.. జిల్లాల వారీగా సీనియర్ IASలకు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పింది. స్పెషల్ ఆఫీసర్లు తక్షణమే కేటాయించిన జిల్లాలకు చేరుకుని.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయ, పునరావాస చర్యలు పర్యవేక్షించాలన్నారు. నష్టం అంచనా, పరిహారం పంపిణీ, పునరుద్ధరణ పూర్తయ్యేవరకు.. విధులు కొనసాగించాలని స్పెషల్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది..
ఇది కూడా చదవండి: మొంథా తుఫాన్.. ఈ జిల్లాలోని పాఠశాలలకు 3 రోజులు సెలవులు..
తుపాను సహాయ చర్యల కోసం ప్రత్యేక అధికారుల నియామకం..
జోనల్ ఇంచార్జ్ అధికారులుగా శ్రీకాకుళం నుంచి కొనసీమ వరకు ఉన్న తీరప్రాంతాల జిల్లాలకు అజయ్ జైన్ ఐఏఎస్
పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఆర్.పి. సిసోడియా ఐఏఎస్
సహాయ చర్యలు పూర్తయ్యే వరకు, నష్టాల లెక్కింపు, బాధితులకు పరిహారం పంపిణీ, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే వరకు ఆయా ప్రాంతాల్లోనే ఉండి.. పర్యవేక్షించనున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు కెవిఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్,
విజయనగరం జిల్లాకు పట్టన్‌షెట్టి రవి సుబాష్ ఐఏఎస్,
మన్యం జిల్లాకు నారాయణ భారత్ గుప్తా ఐఏఎస్,
విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్ ఐఏఎస్,
అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వడరేవు వినయ్ చంద్ ఐఏఎస్,
తూర్పు గోదావరి జిల్లాకు కె.కన్న బాబు ఐఏఎస్,
కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణ తేజ ఐఏఎస్,
కొనసీమ జిల్లాకు విజయ రామరాజు ఐఏఎస్,
పశ్చిమ గోదావరి జిల్లాకు వి ప్రసన్న వెంకటేశ్ ఐఏఎస్,
ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే ఐఏఎస్,
కృష్ణా జిల్లాకు అమ్రాపాలి ఐఏఎస్,
ఎన్టీఆర్ జిల్లాకు శశి భూషణ్ కుమార్ ఐఏఎస్,
గుంటూరు జిల్లాకు ఆర్.పి. సిసోడియా ఐఏఎస్,
బాపట్ల జిల్లాకు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్
ప్రకాశం జిల్లాకు కొనా శశిధర్ ఐఏఎస్,
నెల్లూరు జిల్లాకు డా.ఎన్.యువరాజ్ ఐఏఎస్,
తిరుపతి జిల్లాకు పి. అరుణ్ బాబు ఐఏఎస్,
చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీష ఐఏఎస్ ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




