CEO: ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం పలు సూచనలు.. కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ ఎన్నికల వేడి ఎక్కువైపోతుంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదునుపెడుతుండగా.. ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రెండు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ స్వీప్ బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో సమావేశమై పలు సూచనలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ ఎన్నికల వేడి ఎక్కువైపోతుంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదునుపెడుతుండగా.. ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రెండు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ స్వీప్ బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో సమావేశమై పలు సూచనలు ఇచ్చింది. తాజాగా మరోసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఈవో ముకేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికలకు సంబంధించి మొత్తం వివరాలు సేకరించిన సీఈవో మీనా మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేసారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల ఏర్పాటుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు మీనా. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వర రావు, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటులో జాగ్రత్తలు..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై కలెక్టర్లు నివేదికలు పంపించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కరెంట్, ఫర్నీచర్ వంటి ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కావలసిన కనీస వసతులు ఏర్పాటుచేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపైనా దిశానిర్ధేశం చేసారు సీఈవో మీనా. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకము, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ పై చర్చించారు. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా చేసే చర్యలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆస్కారం ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అక్రమ మద్యం, నగదు రవాణాపైనా కీలక ఆదేశాలు చేసారు. జిల్లాల బోర్డర్ల వద్ద చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..