AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: మెడలో బంగారు వేసుకొనేందుకు జంకుతున్న మహిళలు.. ఎందుకంత భయం

గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొంత మంది కేటుగాళ్లు.. ఈజీ మనీ కోసం అడ్డ దారులను ఎంచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ వృద్ధురాలి మెడలోని చైన్‌ లాక్కోని పారిపోయాడు కేటుగాడు.

Kurnool: మెడలో బంగారు వేసుకొనేందుకు జంకుతున్న మహిళలు.. ఎందుకంత భయం
Chain Snatching
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 23, 2024 | 3:25 PM

Share

గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొంత మంది కేటుగాళ్లు.. ఈజీ మనీ కోసం అడ్డ దారులను ఎంచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ వృద్ధురాలి మెడలోని చైన్‌ లాక్కోని పారిపోయాడు కేటుగాడు.

నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి సమీపమున గల వెంకటాపురం గ్రామం నుంచి ఒక వృద్ధురాలు డోన్ లో ఉన్న కూతురు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆమెను గమనించిన దుండగులు దోచుకునేందుకు ఫ్లాన్ చేశాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మోటారు బైక్‌పై వస్తూ రోడ్డుపైకి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకున్నాడు. ఎవరూ లేని సుంకులమ్మ గుడి సమీపంలో ఉన్న వెంచర్లకు తీసికెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన మాయగాడు.. మహిళా మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కున్నాడు. అంతేకాదు చెవి కమ్మలు కూడా బలవంతంగా లాక్కుంటుండగా వృద్ధురాలు గట్టిగా కేకలు వేసింది. సమీపంలోని రైతులు అక్కడికి చేరుకునేలోగా నిందితుడు బైకుపై ఉడాయించాడు.

స్థానికులు సాయంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి ఆరెస్ట్ చేశారు. దీంతో దొంగరె దొరపల్లె గ్రామానికి చెందిన నరేంద్రగా గుర్తించారు. నరేంద్ర ఫోన్ లొకేషన్ ద్వారా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…