CM Jagan: దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. వరుస సభలు, సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ సామాన్యులకు మరింత చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలులో పర్యటించి స్థానికులు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు.

CM Jagan: దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan Mohan Reddy
Follow us
Balu Jajala

|

Updated on: Feb 23, 2024 | 1:50 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. వరుస సభలు, సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ సామాన్యులకు మరింత చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలులో పర్యటించి స్థానికులు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు.  31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా, అన్ డివైడెడ్ షేర్ ప్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం జరిగిందని జగన్ అన్నారు.  దేశ చరిత్రలో తొలిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామని జగన్ పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చే విషయంగానీ, శాశ్వతంగా మేలు చేసి అడుగులు వేసే విషయంలోగానీ, ఇళ్ల నిర్మాణం విషయంలో గానీ గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా ఎంత ఉందో గమనించాలి. మనం చేసే ప్రతి పనీ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగూ పేదల జీవితాలు మారాలి, వారి బతుకులు మారాలి, పేద పిల్లలు ఎదగాలి, భవిష్యత్ లో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలని ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు గానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలుగానీ, ఏ నిబంధనలైతే వాళ్లకు పెడతామో అటువంటి నిబంధనలతో ఇళ్ల పట్టాలను అందించాం’’ సీఎం జగన్ వెల్లడించారు.

‘‘58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగూ కూడా ఒక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయని మీ బిడ్డగా సంతోషపడుతున్నా.  గ్రామానికి, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో, ఇంటింటికీ తలుపు తట్టి అందించే సేవల విషయంలో విప్లవాత్మకమార్పులు తెచ్చి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ విప్లవాలకు మూలం.. పేదలకోన్యాయం, పెద్దవారికో న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ మార్చేసేయాలి అనే తపన, తాపత్రయంతో పడిన అడుగులు’’ అని జగన్ అన్నారు.

‘‘మొట్ట మొదటి సారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ ను అనుసంధానం చేస్తూ తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడుల్లో పిల్లలకు 8 వ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రయివేటు, కార్పొరేట్ బడులకన్నా ఇంకా గొప్ప స్థాయిలో ట్యాబులచ్చి నడిపిస్తున్నాం.  పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులు మారాయి. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్ పీ ప్యానల్స్.  పేద పిల్లలు కాన్వెట్ డ్రస్, షూస్, చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు. ఇంగ్లీషు మీడియం మొదలు , సీబీఎస్ఈ నుంచి ఈరోజు కార్పొరేట్ బడులు పోటీ పడటానికి కష్టపడేలా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకుని పోతున్నా’’ అని జగన్ అన్నారు.