Andhra Pradesh: పాండవులు నిర్మించిన నక్షత్ర ఆకారంలో రామాలయం.. అధికారులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నపం.

మంత్రాలయం ప్రధాన రహదారిపై ఉన్న పెద్ద తుంబలం గ్రామంలో ఈ ఆలయం వెలిసింది గత అయిదారేళ్ల నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.  ఇప్పటికే పెద్ద తుంబలం గ్రామానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ సొంతంగా కోటి రూపాయలు విరాళంగా అందించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. దీంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ నిర్వాహకులు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు.

Andhra Pradesh: పాండవులు నిర్మించిన నక్షత్ర ఆకారంలో రామాలయం.. అధికారులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నపం.
Rama Temple
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Feb 23, 2024 | 2:02 PM

అయోధ్య రాముడికే కాదు పెద్ద తుంబలం శ్రీరాముడికి కూడా పూర్వవైభవం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. దక్షిణ భారతంలోనే రెండవ సుప్రసిద్ధ శ్రీరామ ఆలయంగా చరిత్రకెక్కింది. నక్షత్ర ఆకారంలో ఉన్న పెద్ద తుంబలం శ్రీరామ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో|అతిపురాతనమైన శ్రీరామ దేవాలయం నక్షత్ర ఆకారంలో ఉంది. ఈ ఆలయాన్ని చాళుక్యులు, పాండవులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1107 సంవత్సరంలో రెండో పులకేశుడు నిర్మించారని మరో చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి కట్టడం రెండోదిగా పేరు గాంచింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి ఆ శాఖ వారు 2016వ సంవత్సరంలో అవార్డు అందించింది. పురావస్తు శాఖ, పర్యాటక శాఖ ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆదోని మంత్రాలయం ప్రధాన రహదారిలోని పెద్దతుంబళం గ్రామంలో ఈ ఆలయం ఉంది.

కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని ఆదోని మంత్రాలయం ప్రధాన రహదారిపై ఉన్న పెద్ద తుంబలం గ్రామంలో ఈ ఆలయం వెలిసింది గత అయిదారేళ్ల నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.  ఇప్పటికే పెద్ద తుంబలం గ్రామానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ సొంతంగా కోటి రూపాయలు విరాళంగా అందించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. దీంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ నిర్వాహకులు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ సీతారామ కళ్యాణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పెద్ద తుంబలం గ్రామంలో వెలిసిన శ్రీ రామ దేవాలయం అభివృద్ధి కోసం పర్యాటక శాఖ పురావస్తు శాఖ దేవాదాయ శాఖ అధికారులందరూ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఆలయం అభివృద్ధి జరిగితే గ్రామం సైతం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..