AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2024: వివాహంలో ఆటంకాలా.. శివరాత్రి రోజున ఈ నైవేద్యాలను సమర్పించండి..

శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ రోజున చేసే పూజలో బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం మొదలైన వాటితో పూజిస్తారు. హిందూ మతంలో పండగల సమయంలో దేవుళ్ళకు ఇష్టమైన కొన్ని ప్రసాదాలు, నైవేద్యాలు ఉన్నాయి. వీటిని శివునికి సమర్పించడం ద్వారా మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది. మహా శివరాత్రి రోజున శివయ్యకు ఏయే ఆహారాలను సమర్పించడం ద్వారా సంతోషిస్తాడో తెలుసుకుందాం.

Mahashivratri 2024: వివాహంలో ఆటంకాలా.. శివరాత్రి రోజున ఈ నైవేద్యాలను సమర్పించండి..
Mahashivratri
Surya Kala
|

Updated on: Feb 23, 2024 | 1:34 PM

Share

మహాశివరాత్రి పండుగ శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహా శివరాత్రి మార్చి 8, 2024 శుక్రవారం నాడు వచ్చింది. మహాశివరాత్రి పవిత్ర పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివ పార్వతిల వివాహం ఈ రాత్రినే జరిగిందని.. లింగోద్భవం జరిగిందని నమ్ముతారు. ఈ రోజున శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ రోజున చేసే పూజలో బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం మొదలైన వాటితో పూజిస్తారు. హిందూ మతంలో పండగల సమయంలో దేవుళ్ళకు ఇష్టమైన కొన్ని ప్రసాదాలు, నైవేద్యాలు ఉన్నాయి. వీటిని శివునికి సమర్పించడం ద్వారా మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది. మహా శివరాత్రి రోజున శివయ్యకు ఏయే ఆహారాలను సమర్పించడం ద్వారా సంతోషిస్తాడో తెలుసుకుందాం.

మహాశివరాత్రి నాడు శివునికి వీటిని సమర్పించండి

శివ పురాణం ప్రకారం శివుడుకి ఖీర్, హల్వా, పెరుగు, పాలు, తెల్లటి బర్ఫీ,  పంచామృతం, తేనె, లస్సీ వంటి వాటిని నైవేద్యంగా సమర్పించండి. కనుక మహాశివరాత్రి రోజున శివునికి ఈ నైవేద్యాలన్నింటినీ సమర్పించవచ్చు. ఈ నైవేద్యాలను సమర్పించడం ద్వారా మీ వివాహంలో అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వాసం.

ఖీర్ ఆఫర్ చేయండి

మహాశివరాత్రి రోజున శివుడికి ఖీర్ నైవేద్యంగా పెట్టడం వల్ల కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అదే సమయంలో ఈ రోజున శివుని ఆరాధనలో ఖీర్‌ను చేర్చడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గృహ సమస్యలు కూడా తీరతాయి.

ఇవి కూడా చదవండి

పంచామృతం

మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతం, పాలు ,పెరుగును సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు. వ్యక్తి మానసిక వికాసం పొందుతాడు.

తేనె

మహాశివరాత్రి రోజున శివునికి తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహాలు శాంతిస్తాయి. గ్రహాల బలహీన స్థానంలో ఉంటే గ్రహాల అనుగ్రహం కోసం తేనే సమర్పిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఇంటిలో ఆర్థిక స్థితి బలపడుతుంది. డబ్బు సంపాదన పెరుగుతుంది.

లస్సీ

లస్సీని శివయ్యకు సమర్పించడం వలన అనుగ్రహం లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత మీరు ప్రసాదాన్ని తీసుకుని ఇతరులకు పంచండి.

హాల్వా

మహాశివరాత్రి శుభ సందర్భంగా శివుడికి హల్వా సమర్పించండి.  శివునికి హల్వాను సమర్పించడం ద్వారా    చాలా సంతోషిస్తాడు. తన భక్తుల కోరికలన్నింటినీ త్వరగా నెరవేరుస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు