AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Disease: రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం వద్దు.. హార్ట్ స్ట్రోక్ హెచ్చరిక కావొచ్చు..

గుండె చప్పుడు పెరగడం, అకస్మాత్తుగా విపరీతంగా చెమట పట్టడం వంటివి గుండెపోటు లక్షణాల్లో ఇమిడి ఉన్నాయని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. కొందరికి రాత్రి పడుకునే సమయంలో హఠాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. అలాంటి వారికి హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే చెమటలు పట్టడం గుండె జబ్బులకు సంకేతం. కనుక ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

Heart Disease: రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం వద్దు.. హార్ట్ స్ట్రోక్ హెచ్చరిక కావొచ్చు..
Heart Disease
Surya Kala
|

Updated on: Feb 23, 2024 | 10:54 AM

Share

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యకం అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికైనా రాత్రిపూట అకస్మాత్తుగా చెమటలు పట్టి.. గుండె కొట్టుకోవడంలో పెరిగితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఈ రెండు లక్షణాలు గుండెపోటుకు సంకేతం కావచ్చు. ప్రస్తుతం ఆరోగ్య విషయంలో ఏ చిన్న విషయాన్నీ విస్మరించకూడదు. అకస్మాత్తుగా గుండె చప్పుడు పెరుగుతున్నట్లు అనిపిస్తే.. దానిని తేలికగా తీసుకోవద్దని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు.

గుండె చప్పుడు పెరగడం, అకస్మాత్తుగా విపరీతంగా చెమట పట్టడం వంటివి గుండెపోటు లక్షణాల్లో ఇమిడి ఉన్నాయని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. కొందరికి రాత్రి పడుకునే సమయంలో హఠాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. అలాంటి వారికి హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే చెమటలు పట్టడం గుండె జబ్బులకు సంకేతం. కనుక ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భంలో బాధితులు  వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈసీజీ, బీపీ వంటి పరీక్షల ద్వారా వైద్యులు ఈ సమస్యను గుర్తించవచ్చు. ECGలో ఏదైనా అసాధారణ రీత కనిపిస్తే  ఎకో లేదా CT స్కాన్ కూడా చేసి రోగ నిర్దన చేసుకోవాల్సి ఉంటుంది.

స్ట్రోక్ లక్షణాలు

ఇవి కూడా చదవండి

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో విధులను నిర్వహిస్తున్న డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ రాత్రి సమయంలో అకస్మాత్తుగా చెమటలు పట్టడం, గుండె చప్పుడు పెరగడం.. గుండె పట్టుకున్న లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో స్ట్రోక్‌కి కూడా కారణం కావచ్చు. ఈ లక్షణాలతో పాటు బీపీ కూడా ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం వంద రెట్లు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో రాత్రిపూట ఎటువంటి కారణం లేకుండా చెమటలు పడుతుంటే, దానిని తేలికగా తీసుకోకండని హెచ్చరిస్తున్నారు.

ఎలా ప్రధమ చికిత్స చేయాలంటే..

డాక్టర్ తరుణ్ కుమార్ మాట్లాడుతూ గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారంలో అధిక కొవ్వు పదార్ధాలను చేర్చుకోవద్దు. అదే సమయంలో తినే  ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోండి. పిండితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఎవరికైనా హై బీపీ సమస్య ఉంటే.. నియంత్రణ కోసం తగిన మెడిసిన్స్ తీసుకోండి. రోజూ వ్యాయామం చేయండి. మానసిక ఒత్తిడికి గురికాకండి.

ఆరునెలలకు ఒక సారి

ప్రతి 6 నెలలకోసారి మీ గుండెను పరీక్షించుకోండి. దీని కోసం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోండి.  ఇప్పటికే గుండె జబ్బులు ఉంటే, వైద్యుల సలహా మేరకు సమయానికి మందులు తీసుకోండి. తినే  ఆహారంలో జాగ్రత్త వహించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..