Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు.. చివరకు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను కొద్దిరోజులుగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌ నుంచే మృత్యువు ఆమెను వెంటాడుతోంది. ఇటీవల 3 గంటలపాటు లిఫ్ట్‌లో చిక్కుకుంది లాస్య నందిత. నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా లాస్య కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగి 10 రోజులు గడవక ముందే కారు ప్రమాదంలో లాస్య మృతి చెందారు. రెండు ఘోర ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య నందిత.. చివరికి ఇవాళ జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.  

Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు.. చివరకు..
Mla Lasya Nandita
Follow us

|

Updated on: Feb 23, 2024 | 10:33 AM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంతో లారీని ఢీకొట్టి అదుపుతప్పిన కారు రెయిలింగ్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ ఆకాష్‌ ‌కు తీవ్రగాయాలుకాగా…ఆస్పత్రికి తరలించారు.

120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు..

ఎమ్మెల్యే లాస్య నందిత సికింద్రాబాద్‌ నుంచి సదాశివపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్‌కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొత్తకారులో బెలూన్లు తెరుచుకున్నాయా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. లారీని ఢీకొట్టాక నేరుగా వెళుతున్న కారు కుదుపుకు గురై అదుపుతప్పింది. పక్కనే ఉన్న రెయిలింగ్‌ను వేగంగా ఢీకొట్టింది.

ఏడాది తేడాలో ఇంట్లో ఇద్దరు మృతి..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత..దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. .బీటెక్‌ కంప్యూటర్ సైన్స్‌ పూర్తి చేశారు. 1986లో జన్మించిన లాస్య…గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్య..ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు. అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య తండ్రి సాయన్న మృతి చెందారు. ఈలోపే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

లిఫ్ట్ లో ఇరుక్కున్న లాస్య

గతేడాది డిసెంబర్‌ 24న సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత… లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఓవర్‌లోడ్‌ అవ్వడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్‌ఫ్లోర్‌ వరకు దూసుకుపోయింది. ఆ తర్వాత లిఫ్ట్‌ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్‌ కాలేదు. దీంతో డోర్లను పగలగొట్టి… లాస్య నందితను బయటికి తీశారు సెక్యూరిటీ సిబ్బంది.

నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా

లిఫ్ట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న లాస్య నందితను… నెలన్నర గ్యాప్‌లోనే మరోసారి మృత్యువు వెంటాడింది. ఈనెల 13న నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్‌ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతింది. కారు టైర్‌ సైతం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో కూడా స్వల్ప గాయాలతో బయటపడింది లాస్య.

కబళించిన మృత్యువు

నల్గొండ యాక్సిడెంట్‌ జరిగిన పది రోజుల్లోనే మరోసారి మృత్యువు తరుముకొచ్చింది. అయితే ఈసారి మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఇవాళ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య.

కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని లాస్య నందిత ఇంటిదగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లోనే ఉన్నారు లాస్య నందిత తల్లి గీత. లాస్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. భారీగా లాస్య ఇంటికి చేరుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు