Medaram Jatara: వనదేవతల దర్శనం కోసం ప్రముఖుల రాక.. నేడు మేడారం వెళ్లనున్న కేంద్ర మంత్రి, తెలంగాణ, గవర్నర్, సీఎంలు

గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. సమ్మక్క తల్లి వచ్చింది.  ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి కిందికి తీసుకురాగానే అమ్మరాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్​ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

Medaram Jatara: వనదేవతల దర్శనం కోసం ప్రముఖుల రాక.. నేడు మేడారం వెళ్లనున్న కేంద్ర మంత్రి, తెలంగాణ, గవర్నర్, సీఎంలు
Medaram Jatara 2024
Follow us

|

Updated on: Feb 23, 2024 | 7:52 AM

మేడారం మహా జాతర మూడో రోజుకి చేరుకుంది. నేడు సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసింది.. రేవంత్‌‌ రెడ్డి 2022లో పీసీసీ ప్రెసిడెంట్‌‌గా మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు.

అలాగే ఈ రోజు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా జాతరకు హాజరవుతారు. గవర్నర్‌‌ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి. కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.

గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. సమ్మక్క తల్లి వచ్చింది.  ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి కిందికి తీసుకురాగానే అమ్మరాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్​ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ‘అమ్మ వచ్చె.. సమ్మక్క వచ్చె..’ అంటూ తన్మయత్వంలో భక్తులు శిగమూగారు. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇక జాతరలో మూడోరోజు గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు ఆనందానికి అవధులు లేవు.

ఇవి కూడా చదవండి

సమ్మక్కను తెచ్చే దారిపొడువునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గద్దెలపైకి వస్తున్న తల్లిపై పసుపు, కుంకుమలతో పాటు ఒడిబియ్యం చల్లుతూ తమను చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. నాలుగురోజుల మేడారం మహాజాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకున్నారు. రెండోరోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క కూడా వచ్చి కొలువుదీరింది. దీంతో మిగితా రెండురోజులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. రెండో రోజు గురువారం సాయంత్రం వరకు 60లక్షల మంది భక్తుల వచ్చారని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ