AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి ఇంటా బయటా అన్నింటా విజయాలే.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?

రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు దిగ్విజయంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహ రించాలి. ఇతరులతో సంప్రదించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

Horoscope Today: ఈ రాశివారికి ఇంటా బయటా అన్నింటా విజయాలే.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2024 | 7:13 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శుక్రుల బలం కారణంగా ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపో తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది పడతారు. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు పెరుగు తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు దిగ్విజయంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహ రించాలి. ఇతరులతో సంప్రదించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలలోనూ, ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు రవితో కలిసి భాగ్య స్థానంలో ఉన్నందువల్ల అధికారుల మంచి ఆదరణ లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించు కోవ డానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సప్తమంలో ఉన్న కుజ, శుక్రుల కారణంగా ఆదాయ మార్గాలన్నీ బాగా పుంజుకుంటాయి. ఆశిం చిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అధికారుల కారణంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ దా యకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరో్గ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సప్తమంలో రవి, బుధుల కారణంగా ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అను కూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందు తారు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

శుభ గ్రహాల అనుకూలత కారణంగా ఆదాయం లేదా జీత భత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. బంధువులకు ఒక శుభకార్యంలో ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఆశిం చిన విధంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలకు మించి పెరుగు తుంది. తోబుట్టువులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా పనిభారం పెరుగు తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో అనుకూలతలు ఏర్పడ తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛలో ఉన్నందువల్ల, మిగిలిన గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు అందుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఉన్నా, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ధన స్థానంలో కుజ, శుక్రులు, పంచమంలో గురువు ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా లాభదాయకంగా, అనుకూలంగా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టు కుంటారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశిలో రవి, బుధుల సంచారం అన్ని విధాలుగానూ గౌరవమర్యాదలను, ప్రభావాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో నష్టాలు ఉండకపోవచ్చు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో గురువు, లాభస్థానంలో కుజ, శుక్రులు కలిసి ఉండడం వల్ల రోజంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగంలో చేరడానికి ఆఫర్ అందుతుంది.

Follow Us