AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Puja Tips: శుక్రవారం రోజున ముగ్గురు దేవతలను ఆరాధించండి.. సంపద, ఆస్తి, ప్రేమ అనుగ్రహం మీ సొంతం..

తీపి వస్తువులను పంచి పెట్టడం శుభప్రదం. పురాణాల ప్రకారం వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శక్తి , దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. వివిధ కారణాల వల్ల శుక్రవారం ఉపవాసం పాటిస్తారు. కొంతమంది పిల్లలు పుట్టడం కోసం, మరికొందరు సంతోషకరమైన జీవితం కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడానికి శుక్రవారం ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది.

Friday Puja Tips: శుక్రవారం రోజున ముగ్గురు దేవతలను ఆరాధించండి.. సంపద, ఆస్తి, ప్రేమ అనుగ్రహం మీ సొంతం..
Friday Puja Tips
Surya Kala
|

Updated on: Feb 23, 2024 | 7:01 AM

Share

శుక్రవారం అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున అమ్మవారి అన్ని రూపాలను పూజించవచ్చు. అటువంటి పరిస్థితిలో  లక్ష్మీ, దుర్గా, సంతోషి మాతను పూజించడంలోని ప్రాముఖ్యతను తెలుసుకోండి. ఈ రోజున ప్రసాదంగా తీపి వస్తువులను పంచి పెట్టడం శుభప్రదం. పురాణాల ప్రకారం వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శక్తి , దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. వివిధ కారణాల వల్ల శుక్రవారం ఉపవాసం పాటిస్తారు. కొంతమంది పిల్లలు పుట్టడం కోసం, మరికొందరు సంతోషకరమైన జీవితం కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడానికి శుక్రవారం ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది.

దుర్గాదేవిని ఇలా పూజించండి

శుక్రవారం దుర్గాదేవికి అంకితం చేసిన రోజు. ఈ రోజున దుర్గా దేవిని పూజించడం, మంత్రాలను పఠించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ‘ఓం శ్రీ దుర్గాయ నమః’ అనే మంత్రోచ్ఛారణతో శుక్రవారం రోజును ప్రారంభించవచ్చు.  దుర్గా దేవి ఈ మంత్రం మూడు శక్తులైన లక్ష్మిదేవి, సరస్వతి, కాళీ ఆరాధన కోసం. దుర్గాదేవిని పూజించాలంటే ముందుగా దుర్గాదేవి విగ్రహాన్ని ఆవాహన చేయాలి. ఇప్పుడు దుర్గాదేవికి స్నానం చేయించండి. ముందుగా నీళ్లతో తర్వాత పంచామృతంతో మళ్లీ నీటితో స్నానం చేయించాలి. ఇప్పుడు దుర్గాదేవికి బట్టలు సమర్పించండి. తరువాత పీఠం ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆపై నగలు , దండలతో అలంకరింపజేయండి. ఇప్పుడు తిలకం దిద్ది.. ధూపం వేయండి. తిలకం కోసం కుంకుమ, గంధాన్ని  ఉపయోగించండి. దీపాన్ని వెలిగించండి. పూజలో ఎర్ర మందార పువ్వులను అమ్మవారికి సమర్పించండి.  నెయ్యి లేదా నూనెతో దీపాన్ని ఇవ్వండి. అనంతరం నైవేద్యాన్ని సమర్పిచండి. పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను సమర్పించి.. ఆ కొబ్బరికాయను పగలగొట్టి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అందరికీ పంచి మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి.

లక్ష్మీదేవిని కూడా పూజించండి

సిరిసంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని కూడా శుక్రవారం పూజిస్తారు. లక్ష్మీ దేవిని తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించాలి. వాటిని పూజించడానికి ఉత్తమ సమయం అర్ధరాత్రి. గులాబీ తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని మాత్రమే పూజించాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు, ముఖ్యంగా తామరపూలను సమర్పించడం ఉత్తమం. స్ఫటిక జపమాలతో లక్ష్మీ దేవి మంత్రాలను జపిస్తే వెంటనే ఫలితం లభిస్తుందని చెబుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

సంతోషి మాత ఆరాధన

అమ్మవారి అవతారమైన సంతోషి మాత రూపాన్ని శుక్రవారం కూడా పూజిస్తారు. సంతోషం, అదృష్టం కోసం సంతోషి మాత 16 శుక్రవారాలు ఉపవాసం చేసే నియమం ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో సంతోషి మాత విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. కలశాన్ని ఏర్పరచి బెల్లం, శనగలు నింపిన గిన్నెను అమ్మవారి విగ్రహం ముందు ఉంచాలి. అనంతరం నెయ్యి దీపం వెలిగించి, అక్షత, పూలు, ధూపం, కొబ్బరి, ఎరుపు బట్టలను సమర్పించండి. కథ చదివిన తర్వాత అమ్మవారికి బెల్లం శనగలను నైవేద్యంగా సమర్పించండి హారతి ఇవ్వండి. సంతోషి మాత కథ చదివి .. ఆ కథ ముగిసిన తర్వాత ఆవుకు బెల్లం, శనగలు తినిపించండి. కలశం దగ్గర పెట్టిన బెల్లం, శనగ ప్రసాదాన్ని అందరికీ పంచండి. కలశంలోని నీటిని ఇంట్లో అన్నిచోట్లా చిలకరించి, మిగిలిన నీటిని తులసికి సమర్పించండి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే వారు శుక్రవారం పులుపును ముట్టకూడదు లేదా తినకూడదు అని గుర్తుంచుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు