Gulmarg Avalanche: గుల్‌మార్గ్‌లో మంచుతుఫాన్ బీభత్సం.. రష్యన్ టూరిస్ట్ మృతి.. ఆరుగురిని రక్షించిన సహాయక సిబ్బంది..
మంచు తుఫాను సమయంలో రష్యా బృందం స్కీయింగ్ కోసం వెళ్ళింది. ఈ సమయంలోనే మంచు తుఫాను విరుచుకుపడటంతో ఒక రష్యన్ మృతి చెందాడు. మరో ఆరుగురు పర్యాటకులను అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గుల్‌మార్గ్‌లో అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు.
జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లో మంచుతుఫాన్ బీభత్సం సృష్టించింది. కొంగ్దూరి వాలుకు సమీపంలో మంచు తుఫాన్‌లో చిక్కుకొని ఓ విదేశీ పర్యాటకుడు చనిపోయాడు. మరో ఆరుగురుని సహాయక సిబ్బంది రక్షించారు. అయితే ఇంకా కొంతమంది టూరిస్టులు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిని కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని రష్యాకు చెందిన టూరిస్ట్‌గా గుర్తించారు.
మంచు తుఫాను సమయంలో రష్యా బృందం స్కీయింగ్ కోసం వెళ్ళింది. ఈ సమయంలోనే మంచు తుఫాను విరుచుకుపడటంతో ఒక రష్యన్ మృతి చెందాడు. మరో ఆరుగురు పర్యాటకులను అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.
📌 The Embassy of #Russia in #India maintains constant contact with the local authorities.
The avalance was triggered by the heavy snowfall observed in the region since February 17. On February 21, a medium danger level avalanche warning was issued for #Baramulla district, J&K. https://t.co/L0LBepa59v
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) February 22, 2024
గుల్‌మార్గ్‌లో అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజాయ్ చేయడానికి వచ్చిన పర్యాటకులు హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక రోడ్లు కూడా మంచుతో నిండిపోయాయి. అనేక చోట్ల రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రయాణం కష్టంగా మారిందని చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 17 నుంచి ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..