Manohar Joshi: లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబాయిలోని పిడి హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం (ఫిబ్రవరి 23) ఆయన తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది మేలో బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ ఇదే ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం..
ఢిల్లీ, ఫిబ్రవరి 23: లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబాయిలోని పిడి హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం (ఫిబ్రవరి 23) ఆయన తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది మేలో బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ ఇదే ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. జోషి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా శివసేన పార్టీకి చెందిన మనోహర్ జోషి వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1995-99 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. శివసేన పార్టీ నుంచి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తి అతను.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.