AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోడీ.. సీఎం యోగితో కలిసి .. వీడియో

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (ఫిబ్రవరి 22) తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. గుజరాత్‌లో బిజీబిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిని పరిశీలించారు.

PM Modi: అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోడీ.. సీఎం యోగితో కలిసి .. వీడియో
PM Narendra Modi, CM Yogi
Basha Shek
|

Updated on: Feb 23, 2024 | 7:47 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (ఫిబ్రవరి 22) తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. గుజరాత్‌లో బిజీబిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిని పరిశీలించారు. ఇటీవలే ఈ రహదారుల ప్రారంభోత్సవం జరిగింది. విమానాశ్రయం, లక్నో, అజంగఢ్ మరియు ఘాజీపూర్ వైపు వెళ్లాలనుకునే BHU, BLW మొదలైన దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో 360 కోట్లతో ఈ రహదారులను నిర్మించారు. BHU నుండి విమానాశ్రయానికి ప్రయాణ దూరం 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గుతోంది. అదేవిధంగా లహర్తర నుంచి కచారి చేరుకునే సమయాన్ని కూడా 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. దీనికి సంబంధించి గురువారం అర్థరాత్రి ట్విటర్‌లో ప్రధాని ఇలా రాసుకొచ్చారు. ‘కాశీకి చేరుకున్నప్పుడు, (నేను) శివపూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని పరిశీలించాను. ఈ ప్రాజెక్ట్ ఇటీవల ప్రారంభమైంది. వారణాసి దక్షిణ ప్రాంత ప్రజలకు ఈ రహదారి చాలా ఉపయోగకరంగా ఉంది.

వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వతంత్ర భవన్‌లో ఎంపీ నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫొటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనే వారితో ప్రధాని సంభాషిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు ప్రముఖులను కూడా ప్రధాని సత్కరిస్తారు. ఇక శుక్రవారం ఉదయం 11.15 గంటలకు సెయింట్ గురు రవిదాస్ జన్మస్థలంలో పూజలు చేయనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత సెయింట్ గురు రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. రవిదాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కార్ఖియావ్ అమూల్ ప్లాంట్ కాంప్లెక్స్‌లో రూ.14 వేల కోట్లకు పైగా విలువైన 36 ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఇవి కూడా చదవండి

వారణాసి వీధుల్లో ప్రధాని మోడీ..

సీఎం యోగితో కలిసి..

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.