Muslim Devotees: ఆ దేవాలయాన్ని ముస్లిం భక్తులే ఎక్కువ దర్శించుకుంటారట.. ఎందుకో తెలుసా.? ఎక్కడుందంటే.!
భారత్ అంటేనే సర్వమత సమ్మేళనం. తమ మత ఆచారాలను పాటిస్తున్నప్పటికీ ఇతర మతాలకు చెందిన దేవుళ్లను మొక్కుతూ మత సామరస్యం చాటుకుంటుంటారు. అయితే ఏపీలో ప్రతియేటా ఉగాది పండుగకు హిందువులే కాదు.. ముస్లింలు సైతం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
భారత్ అంటేనే సర్వమత సమ్మేళనం. తమ మత ఆచారాలను పాటిస్తున్నప్పటికీ ఇతర మతాలకు చెందిన దేవుళ్లను మొక్కుతూ మత సామరస్యం చాటుకుంటుంటారు. అయితే ఏపీలో ప్రతియేటా ఉగాది పండుగకు హిందువులే కాదు.. ముస్లింలు సైతం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లే ఎక్కువ సంఖ్యలో దేవుడ్ని దర్శించుకొని పూజలు చేస్తుంటారు. అయితే ఆధ్యాత్మికం కార్యక్రమం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదువాల్సిందే.
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా కడప జిల్లాలోని ఓ ఆలయంలో ముస్లింలు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా అనవాయితీగా పూజలు చేస్తుంటారు. నూతన సంవత్సరం ప్రారంభంలో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు కడపలోని దేవుని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ముస్లింలు బారులు తీరుతుంటారు. శ్రీవేంకటేశ్వరుని వెలసిన తిరుమల తిరుపతికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
రాయలసీమ ప్రాంతంలోని ముస్లింలు ప్రతి సంవత్సరం ఉగాది నాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన ఓ ముస్లిం భక్తుడు మాట్లాడుతూ.. ‘నేను చిత్తూరు వాసిని, ఉగాది రోజున ప్రార్థనల కోసం ఇక్కడికి వస్తాను. మాకు జనవరి 1 కొత్త సంవత్సరం కాదు.. ఉగాది కొత్త సంవత్సరం. మాకు రంజాన్ లాగే ఉగాది పండుగను జరుపుకుంటాం. స్వామిని ప్రార్థించడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి, ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వస్తాం. మా పెద్దలు కూడా ఉగాదికి ఇక్కడికి వచ్చి ఆ సంప్రదాయాన్ని పాటిస్తాం’’ అని చెప్పాడు.
ఉగాదికి ముందు ముస్లిం భక్తులు మాంసాహారం తినడం మానేస్తారు. అన్నం, మసాలా దినుసులు, బెల్లం స్వామివారికి సమర్పిస్తారు. క్రీ.శ.1311లో మాలిక్ కాఫూర్ అనే సైన్యాధిపతి కుమార్తె బీబీ నాంచారమ్మను వేంకటేశ్వరస్వామి తమ అల్లుడిగా వివాహం చేసుకున్నాడని వారు నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి