Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా! ముక్కు నుంచి రక్తస్రావం.. డాక్టర్లకు షాక్ ఇచ్చే దృశ్యం.. 150 బతికి ఉన్న పురుగులు

. ఓ వ్యక్తి ముక్కులో పురుగులు కాపురం పెట్టేశాయి. అతని ముక్కులోని మాంసాన్ని తింటూ హ్యాపీగా జీవిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 పురుగులు బతికేస్తున్నాయి. తాజాగా వైద్యులు అతనికి ఆపరేషన్ చేసి ఈ జీవులను ముక్కు నుంచి బయటకు తీశారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వ్యక్తికి కూడా తన ముక్కులో పురుగులున్నాయనే విషయం తెలియకపోవడం.

ఓరి దేవుడా! ముక్కు నుంచి రక్తస్రావం.. డాక్టర్లకు షాక్ ఇచ్చే దృశ్యం.. 150 బతికి ఉన్న పురుగులు
Bugs In Florida Man's NoseImage Credit source: Pexels
Follow us
Surya Kala

|

Updated on: Feb 23, 2024 | 12:03 PM

ఇన్ఫెక్షన్ గురించి ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో వినే. .ఒకొక్కసారి ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తికీ ఏర్పడిన ఇన్ఫెక్షన్ వంటి షాకింగ్ న్యూస్ ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా విని ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇన్ఫెక్షన్ ఇంత అసహ్యకరంగా ఉంటుందా.. ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎక్కడా ఇంతకు ముందు చూసి ఉండలేదు అని కూడా అనుకుంటారు. ఓ వ్యక్తి ముక్కులో పురుగులు కాపురం పెట్టేశాయి. అతని ముక్కులోని మాంసాన్ని తింటూ హ్యాపీగా జీవిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 పురుగులు బతికేస్తున్నాయి. తాజాగా వైద్యులు అతనికి ఆపరేషన్ చేసి ఈ జీవులను ముక్కు నుంచి బయటకు తీశారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వ్యక్తికి కూడా తన ముక్కులో పురుగులున్నాయనే విషయం తెలియకపోవడం.

ఫస్ట్ కోస్ట్ న్యూస్ ప్రకారం రోగికి చెందిన వివరాలు రహస్యంగా ఉంచారు. ఈ వ్యక్తి ముక్కు నుంచి రక్త స్రావం అవుతుందని ఈ వారం ప్రారంభంలో హెచ్‌సిఎ ఫ్లోరిడా మెమోరియల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. అక్కడ వైద్యులకు తన ముక్కు నుంచి రక్తస్రావం అవుతుందని.. విపరీతమైన నొప్పి వస్తుందని చెప్పాడు. దీంతో ENT వైద్యుడు డేవిడ్ కార్ల్‌సన్ అతన్ని పరీక్షించగా..  అతను ముక్కు లోపలి భాగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

ముక్కు లోపల చూసి షాక్ తిన్న డాక్టర్

డాక్టర్ కార్ల్సన్ ఆ వ్యక్తి ముక్కులో ఏదో వింతను గమనించాడు. దీని తరువాత అతను కెమెరాతో ముక్కు లోపలికి చూసినప్పుడు.. ఆ వ్యక్తి నాసికా రంద్రం లోపల డజన్ల కొద్దీ కీటకాలు నివాసం ఏర్పరచుకుని ఉన్నాయి. అంతేకాదు అవి అతని ముక్కు లోపల నుంచి చర్మాన్ని తింటున్నట్లు డాక్టర్ కనుగొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరణం అంచుల వరకూ వెళ్లిన రోగి

ముక్కు నొప్పి కారణంగా ముఖం వాచిపోయిందని రోగి వైద్యుడికి చెప్పాడు. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నానని.. అదే సమయంలో ముఖం మీద నిప్పుల వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తుందని వివరించాడు. దీంతో డాక్టర్‌ అతనిని పరీక్షించగా ముక్కులో చిన్న చిన్న పురుగులు ఉన్నట్లు కనుగొన్నాడు. అంతేకాదు .  అతని ముక్కు లోపల పెరిగుతున్న కీటకాలు అతని కంటి చూపును దూరం చేస్తాయి.  క్రమంగా ప్రాణం కూడా పోయి ఉండవచ్చని డాక్టర్ చెప్పాడు.

ముక్కు నుండి 150 సజీవ కీటకాలను తొలగించిన డాక్టర్

డాక్టర్ కార్ల్సన్ మాట్లాడుతూ లార్వా పరిమాణం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను పెద్ద ప్రమాదంలో  ఉన్నాడని తనకు అర్ధం అయింది. ఎందుకంటే ఆ పురుగులు ముక్కు నుంచి క్రమంగా అతని కళ్లకు చేరుకుంటున్నాయి.. అంతేకాదు మెదడుకు చేరుకునేందుకు దారిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి రోగి ముక్కు నుండి 150 బతికి ఉన్న పురుగులను తీసివేశారు.

అరుదైన కేసు అని డాక్టర్ చెప్పారు

ఈ లార్వాలు రోగి పుర్రె పైన..  మెదడు క్రింద ఉన్నాయని చెప్పారు. లార్వా అక్కడ నుంచి మెదడుకు చేరి ఉంటే.. అతను చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఆపరేషన్ తర్వాత, రోగికి 30 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేసి కణితిని తొలగించారని..  అతని బలహీనమైన రోగనిరోధక శక్తి, వ్యాధి వ్యాప్తికి దోహదపడి ఉండవచ్చని చెప్పారు. అంతేకాదు అమెరికాలో తొలిసారిగా ఇలాంటి కేసు చూశానని డాక్టర్ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..