Small Washing Machine: సాయి నీ ఐడియా అదుర్స్.. బుల్లి వాషింగ్ మెషిన్‌కు నెటిజన్స్ ఫిదా, చక్కర్లు కొడుతున్న వీడియో!
ఏదైనా ఆవిష్కరణలు చేయడానికి పెద్ద పెద్ద చదువులు చదువనక్కర్లేదు.. బుర్రనిండా పదునైన ఆలోచనలు ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు. ఆసక్తితో పాటు క్రియేటివిటీ ఉంటే చాలు దూసుకుపోవచ్చు. ఇందుకు ఉదాహరణే ఈ ఫొటోలోని వ్యక్తి. ఏపీని చెందిన ఓ వ్యక్తి బుల్లి వాషింగ్ మెషిన్ తయారుచేసి వార్తల్లోకి ఎక్కాడు.

ఏదైనా ఆవిష్కరణలు చేయడానికి పెద్ద పెద్ద చదువులు చదువనక్కర్లేదు.. బుర్రనిండా పదునైన ఆలోచనలు ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు. ఆసక్తితో పాటు క్రియేటివిటీ ఉంటే చాలు దూసుకుపోవచ్చు. ఇందుకు ఉదాహరణే ఈ ఫొటోలోని వ్యక్తి. ఏపీని చెందిన ఓ వ్యక్తి బుల్లి వాషింగ్ మెషిన్ తయారుచేసి వార్తల్లోకి ఎక్కాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్ తయారుచేసిన ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
‘సాయి తిరుమలనీది రూపొందించిన అతిచిన్న వాషింగ్ మెషీన్ 37 ఎంఎం x 41 ఎంఎం x 43 ఎంఎం (1.45 అంగుళాలు x 1.61 అంగుళాలు x 1.69 అంగుళాలు). చిన్న చిన్న భాగాలతో వాషింగ్ మెషీన్ ను సాయి తిరుమల తయారు చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఒక స్విచ్, ఒక చిన్న పైపుతో పరికరాన్ని పూర్తి చేసిన తరువాత, ఎలా పనిచేస్తుందో చూపించాడు. వీడియోలో సాయి తిరుమల కొద్దిపాటి నీటిని మెషిన్ లో పోస్తాడు. ఆ తర్వాత ఒక చిన్న క్లాత్ ను యంత్రంలో ముంచుతాడు. ఆ తర్వాత డిటర్జెంట్ వేసి బుల్లి మెషిన్ ను స్టార్ట్ చేస్తాడు. కొద్ది నిమిషాల తర్వాత యంత్రం ఆ క్లాత్ ను శుభ్రంగా ఉతుకుతుంది. ఈ ప్రాసెస్ ను వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోను ఒక రోజు క్రితం పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఇది 5.1 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అతని ప్రతిభపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘గుడ్ జాబ్ బ్రదర్’ అని కొందరు, చాలా బాగుందంటూ ఇంకొందరు, “భారతదేశం ప్రతిభావంతులతో నిండి ఉంది! అంటూ మరికొందరు కామెంట్లు చేస్తూ అభినందించారు. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో ను చూడండి మరి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



