Medaram 2024: సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న గవర్నర్.. బంగారం సమర్పించిన తమిళిసై
గవర్నర్ తమిళి పై కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘన స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువు తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు గవర్నర్. తమిళిసై సౌందరరాజన్ జాతరకు హాజరయ్యారు. గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాతర మూడో రోజుకు చేరుకుంది. వనాలను వీడి జనాలమధ్యకు వచ్చిన వన దేవతలను దర్శించుకోవడానికి సెలబ్రెటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి చేరుకుంటున్నారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అమ్మవార్లను దర్శించుకున్నారు. గవర్నర్ తమిళి పై కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘన స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువు తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు గవర్నర్.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతరకు హాజరయ్యారు. గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.
మరోవైపు నేడు సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసింది.. రేవంత్ రెడ్డి 2022లో పీసీసీ ప్రెసిడెంట్‌గా మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. .ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..