ఆహా.. భూతల స్వర్గం అంటే ఇదేనేమో..! ప్రకృతిచేసిన అందాల మాయ.. అరకులోయ! ఆంధ్రా ఊటీకి క్యూ కట్టిన సందర్శకులు..
Visakhapatnam: వందలాది గా వాహనాలు అరకుకు తరలి వస్తుండడంతో ఘాట్ రోడ్డులో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. టూరిస్ట్ లు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. రూములు దొరక్క పోయిన ఖాళీ ప్రదేశాల్లో పర్యాటకులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండి పోతున్నాయి.
విశాఖపట్నం,అక్టోబర్15; ఆంధ్రా ఊటి అరకులోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ లో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నయి. తెల్ల గలవారుతుండగా మంచు తిరగడం చీల్చుకొని ఆ ఉదయభానుడు తొంగి చూస్తుంటే ఆ దృశ్యాల అనుభూతే వేరు. వికెండ్ కావడంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగింది. మేఘాల కొండలైన వంజంగి, మాడగడ కు పోటెత్తారు పర్యాటకులు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు.
– ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. కూల్ క్లయిమేట్ సందర్శకులను ఆహ్వానిస్టోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచు తో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దింతో సందర్శకులు అరకు క్యూకడుతున్నారు. మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు.
సీజన్ కంటే ముందే ప్రకృతి సోయగాలు..
– ఈ ఏడాది సీజన్ ముందే ప్రారంభమయ్యేలా కనిపించింది. ఎందుకంటే శీతాకాలంలో ఉండే చలి దృశ్యాలు కాస్త ముందే దర్శనమిచ్చాయి. సుందర వాతావరణం పర్యారకులను తమవైపు ఆకర్షస్టోంది. దీంతో అరకు తో పాటు ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలు.. రద్దీగా మారాయి. కిటకిట లాడుతున్నాయి. కూల్ క్లైమేట్ లో ఏజెన్సీ సోయగాలు మరింత పులకించడంతో వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడు తున్నాయి.
పాలసముద్రంలా వంజంగి మేఘాలకొండ, మాడగడ..
– పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండ తో పాటు.. అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగ మంచు కొమ్ముకుంది. సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. ఇందుకోసం.. సాటర్డే సాయంత్రం నుంచి కాపు కాసారు. సండే సూర్యోదయాన్నె .. కొండల మధ్య లోయలో పాల సముద్రం లాంటి మేఘాలను చూసి ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. పొగమంచుతో పాటు చల్లనిగాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రకృతి అందాలు కూలి క్లైమేట్ అరకులోనే దర్శనం ఇస్తుందని అంటున్నారు సందర్శకుడు పవన్. నవంబర్ డిసెంబర్ లో వచ్చే సీజన్ ముందే రావడంతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నామని అంటున్నారు.
హోటల్లు, లాడ్జిలకు ఫుల్ డిమాండ్..
– ఇక.. వందలాది గా వాహనాలు అరకుకు తరలి వస్తుండడంతో ఘాట్ రోడ్డులో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. టూరిస్ట్ లు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. రూములు దొరక్క పోయిన ఖాళీ ప్రదేశాల్లో పర్యాటకులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండి పోతున్నాయి.
– ఈమధ్య కాలంలో అరకులోతో పాటు ఏజెన్సీ పర్యాటక ప్రతాలకు ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావడం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. సీజన్ ఆరంభమే అదిరిపోవడంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులపై ఆధారపడిన వ్యాపారస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..