Telangana: బతుకమ్మ సంబరాల్లో భలే ప్రచారం.. పతులు ప్రచారంలో ఆ నేతల సతులు బతుకమ్మ సంబరాల్లో సందడి…
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతుకమ్మ పాటలకు ఆడి పాడి కోలాటాలు వేశారు. అయితే, జిల్లాలో రాజకీయ నేతల సతీమణులు సైతం బతుకమ్మ సంబరాల్లో తెగ సందడి చేశారు. ఆ నేతలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీబిజీగా గడుతుంటే వారి సతీమణులు మహిళలతో కలిసి ఆడి పాడి ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు... వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి, MLAల సతీమనుల బతుకమ్మ ఉత్సవాల జోష్ మామూలుగా లేదు..
ఉమ్మడి వరంగల్ జిల్లా, అక్టోబర్15: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి..పల్లెలు – పట్టణాలన్నీ మహిళల కోలాహలం, బతుకమ్మ సంబరాల జోష్ తో వెలిగి పోతున్నాయి.. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతుకమ్మ పాటలకు ఆడి పాడి కోలాటాలు వేశారు. అయితే, జిల్లాలో రాజకీయ నేతల సతీమణులు సైతం బతుకమ్మ సంబరాల్లో తెగ సందడి చేశారు. ఆ నేతలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీబిజీగా గడుతుంటే వారి సతీమణులు మహిళలతో కలిసి ఆడి పాడి ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు… వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి, MLAల సతీమనుల బతుకమ్మ ఉత్సవాల జోష్ ను మీరే చూడండి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆడ పడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు..
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటాలు వేసి.. ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు తెలిపారు.. ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ తొర్రూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. మహిళలతో కలిసి నృత్యాలు చేశారు..
మరోవైపు పలువురు ఎమ్మెల్యేల సతీమణులు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు… పరకాల MLA చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. మహిళలతో కలిసి సందడిగా సరదాగా డ్యాన్స్‌లు చేశారు. అటు, నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న నర్సంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. అంగడి సెంటర్లో మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు లయబద్దంగా నృత్యాలు చేశారు..
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి Dr సీతామహాలక్ష్మి మహబూబాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. స్థానిక మహిళతో కలిసి నృత్యాలు చేశారు. ములుగు లో BRS అభ్యర్థి బడే నాగజ్యోతి స్థానిక మహిళతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. వారితో కలిసి నృత్యాలు చేశారు. అసలే ఎన్నికల సమయం కావడంతో నేతల సతీమణుల హడావుడి చూసి మహిళలంతా ఆశ్చర్యపోయారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..