Study: బీర్ ప్రియులకు ‘చేదు’ వార్త.. తగ్గుతున్న రుచి.. ధరలో కూడా భారీగా హెచ్చుతగ్గులు..!

2020లో కోవిడ్-19 మహమ్మారి సంభవించినప్పటి నుండి బీర్ ధర 13శాతం పెరిగింది. అధిక, మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతలు హాప్‌ల ఆల్ఫా బిట్టర్ యాసిడ్స్‌లో తగ్గుదలకు దారితీశాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది బీర్‌ రుచిని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ,

Study: బీర్ ప్రియులకు 'చేదు' వార్త..  తగ్గుతున్న రుచి.. ధరలో కూడా భారీగా హెచ్చుతగ్గులు..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 15, 2023 | 8:19 AM

బీర్ ప్రియులకు ఓ ‘చేదు’ వార్త. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు బీర్ నాణ్యత, రుచిని మారుస్తున్నాయని ఒక అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రత, వర్షం, భూగర్భ జలాలు, అడవులు మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం, పానీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పు మొక్క పరిమాణం మరియు నాణ్యతను ప్రభావితం చేస్తుంది. బీర్‌ను మరింత ఖరీదైనదిగా చేస్తుంది. తయారీదారులు తమ తయారీ పద్ధతులను సర్దుబాటు చేయవలసి వస్తుంది. రైతులు వేడి పొడి వాతావరణానికి సర్దుబాటు చేయకపోతే 2050 నాటికి యూరోపియన్ ప్రాంతాలలో హాప్ దిగుబడి 4-18 శాతం తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వేసవికాలం వేడిగా, ఎక్కువ రోజులు వాతావరణం పొడిగా మారినప్పుడు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచిఉందన్నారు.నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ విపరీత వాతావరణం బీర్ ఉత్పత్తికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రతిస్పందనగా, హాప్ రైతులు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. వారు హాప్ గార్డెన్‌లను ఎత్తైన ప్రదేశాలకు, లోయలకు మారుస్తున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావం బీర్ రుచిని కూడా పాడు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్న అధ్యయనం అందరినీ షాక్‌ కు గురిచేస్తుంది. బీర్ అభిరుచులకు, వాతావరణ మార్పులకు ఎక్కడ సంబంధం ఉందని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, ధాన్యాలు, నీరు, ఈస్ట్, హాప్‌లు బీర్ ఉత్పత్తిలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు. హాప్ ఫ్లవర్ వివిధ రకాల బీర్ చేదు, రుచిని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గింజలు, హాప్‌లతో కలిపి బాగా ఉడికిస్తారు. అప్పుడు బీరు చేదు విడుదల అవుతుంది. అంటే బీరు రుచికి ఈ పూలు చాలా ముఖ్యం. కానీ తీవ్రమైన వాతావరణం కారణంగా ఈ పువ్వులు వాడిపోతున్నాయి. దీని వల్ల బీర్ రుచి మారడమే కాకుండా రానున్న రోజుల్లో బీర్ ఖరీదు కూడా పెరుగుతుందని సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది.

నీరు, టీ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే డ్రింక్‌ బీర్ అని పరిశోధన మరింత హైలైట్ చేస్తుంది. సాంప్రదాయ బీర్ తయారీకి మధ్య ఐరోపాలో గొప్ప చరిత్ర ఉంది. ఇది నియోలిథిక్ కాలం 3500-3100 BC నాటిది. నీరు కాకుండా, మాల్టెడ్ బార్లీ, ఈస్ట్, హాప్స్, బీర్‌కు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్లే సాంప్రదాయ బీర్‌ల జనాదరణ పెరగడంతో, అధిక నాణ్యత, సువాసనగల హాప్‌లకు డిమాండ్ పెరుగుతుంది. కరువు పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత ఈ పువ్వుల పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఐరోపాలో సాంప్రదాయ హాప్స్ పంట 2050 నాటికి 4-18శాతం తగ్గుతుంది. అదనంగా, సుగంధ హాప్ ఆమ్లాల ఉత్పత్తి 20-31శాతం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

2020లో కోవిడ్-19 మహమ్మారి సంభవించినప్పటి నుండి బీర్ ధర 13శాతం పెరిగింది. అధిక, మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతలు హాప్‌ల ఆల్ఫా బిట్టర్ యాసిడ్స్‌లో తగ్గుదలకు దారితీశాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది బీర్‌ రుచిని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, మానవ కార్యకలాపాల నుండి వెలువడే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదం చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...