Gold Price Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్కసారిగా భారీగా పెరిగిన ధరలు.. తాజా ధరలివే..
Gold Price Today: బంగారం ప్రియుడు ఇది నిజంగా బిగ్ షాక్. నిన్నటి వరకు ఊగిసలాటలో ఉన్న బంగారం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1530 లకు జంప్ అయి.. రూ. 60,440 లకు చేరుకుంది.

Gold Price Today: బంగారం ప్రియుడు ఇది నిజంగా బిగ్ షాక్. నిన్నటి వరకు ఊగిసలాటలో ఉన్న బంగారం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1530 లకు జంప్ అయి.. రూ. 60,440 లకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా స్వల్ప మార్పులతో తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా 1,500 పైచిలుకు పెరగడంతో బంగారం కొనుగోలుదారులు షాక్ అయ్యారు. శనివారం (అక్టోబర్14) తో నేటి (అక్టోబర్ 15) ధరలను పోలిస్తే చాలా తేడా నమోదైంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ రేట్ రూ. రూ. 60,440కి చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా పసిడితో సమానంగా పరుగులు తీశాయి. ఒక్క రోజులోనే కేజీ వెండిపై రూ. 1500 పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు వివరాలు..
☛ హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,440 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,400 పలుకుతోంది.
☛ ఏపీలోని విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,440 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,400 ఉంది.
☛ విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,400 పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్స్ ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ:
☛ 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,550
☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గొల్డ్ ధర రూ. 60,590గా ఉంది.
బెంగళూరు:
☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,440
☛ 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,400
ముంబై:
☛ 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,400
☛ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,440
కోల్‌కతా:
☛ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400.
☛ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,440.
చెన్నై:
☛ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550.
☛ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,600గా ఉంది.
పూణె:
☛ 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,400
☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440
దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయి..
దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్నిచోట్ల మినహా దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 74,100, ముంబైలో రూ. 74,100, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 74,100, చెన్నైలో రూ. 77,000 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








