Andhra Pradesh: పగలంతా పాత సామాన్లు కొంటాడు.. రాత్రైతే కత వేరే లేవెల్..

పుణ్యం కొద్ది పురుషార్థం.. పిండి కొద్ది రొట్టే అంటారు.. వీడు కూడా అలాగే ఆలోచించాడో ఏమో గానీ.. కష్టం కొద్ది ఫలితం అనుకుని.. పగలొక పని, రాత్రొక పనికి తెరలేపాడు. అయితే పగలేమో పవిత్రుడు.. రాత్రైతే చాలు కతలు..

Andhra Pradesh: పగలంతా పాత సామాన్లు కొంటాడు.. రాత్రైతే కత వేరే లేవెల్..
Thief Arrest
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:15 PM

పుణ్యం కొద్ది పురుషార్థం.. పిండి కొద్ది రొట్టే అంటారు.. వీడు కూడా అలాగే ఆలోచించాడో ఏమో గానీ.. కష్టం కొద్ది ఫలితం అనుకుని.. పగలొక పని, రాత్రొక పనికి తెరలేపాడు. అయితే పగలేమో పవిత్రుడు.. రాత్రైతే చాలు కతలు వేరే లేవెల్లో ఉంటాయి. ఈజీ మనికి అలవాటు పడిన ఈ కేటుగాడు.. వాహనాల్లోని బ్యాటరీలను కాజేసి విక్రయించేవాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. కానీ, ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒకరోజు పట్టుబడాల్సిందే కదా. వీడి విషయంలోనూ అదే జరిగిందిక్కడ. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పగలంతా పాత సామాన్లు కొనేవాడిలా ఆటోలో తిరుగుతాడు. ఎక్కడెక్కడ వాహనాలు నిలిపి ఉంచుతున్నారో తెలుసుకుంటాడు. రాత్రి వేళ వచ్చి.. ఆయా వాహనాల్లో బ్యాటరీలను దొంగలిస్తుంటాడు. ఇలా.. చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు పోలీసు స్టేషన్ల పరిధిలో తొమ్మిది చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిని చల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. చల్లపల్లి, అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో నిలిపిన బస్సులు, లారీలు, ట్రాక్టర్ల నుంచి బ్యాటరీలు దొంగిలిస్తున్న ఘటనలపై ఎస్పీ పి. జాషువా ఆదేశాలతో చల్లపల్లి ఎస్ఐ డి. సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్ఐ సందీప్.. సీసీ ఫుటేజీలు పరిశీలించి, అనుమానితులను ప్రశ్నిస్తూ.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చల్లపల్లి పార్కు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ట్రక్కు ఆటో డ్రైవరు పోలీసులను చూసి వెనక్కివెళ్లడం చూశారు. వెంటనే ఆ ఆటోను తనిఖీచేస్తే అందులో బ్యాటరీలు ఉన్నాయి. పోలీసులు విచారిస్తే.. బ్యాటరీల చోరీ విషయం వెలుగుచూసింది. నిందితుడు కూచిపూడి శివారు ధర్మవరానికి చెందిన సింహాద్రి బాలచంద్ అలియాస్ చందును అరెస్ట్ చేశారు. నాలుగు స్టేషన్లలో తొమ్మిది కేసులకు సంబంధించిన రూ.1.68 లక్షలు విలువైన బ్యాటరీలను రికవరీ చేశామని సీఐ రవికుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..