YS Jagan: గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు.. రెండు పార్టీలకు చెక్ పెట్టేలా కీలక నేతలతో వ్యూహరచన
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో మరోసారి అధికారంలోకి రావడం మాత్రమే తన లక్ష్యం కాదని, రాజకీయంగా టీడీపీ, జనసేన పార్టీలు కోలుకోలేని దెబ్బ కొట్టేలే ఫ్లాన్ చేశారు. పలువురు కీలక నేతలతో సమావేశమైన జగన్ వ్యుహాలకు పదును పెట్టారు. అస్సలు ఇంతకు బస్సు యాత్రతో వైఎస్ జగన్ వేసిన అడుగులు ఎంటీ..?
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో మరోసారి అధికారంలోకి రావడం మాత్రమే తన లక్ష్యం కాదని, రాజకీయంగా టీడీపీ, జనసేన పార్టీలు కోలుకోలేని దెబ్బ కొట్టేలే ఫ్లాన్ చేశారు. పలువురు కీలక నేతలతో సమావేశమైన జగన్ వ్యుహాలకు పదును పెట్టారు. అస్సలు ఇంతకు బస్సు యాత్రతో వైఎస్ జగన్ వేసిన అడుగులు ఎంటీ..? తెలుగుదేశం, జనసేన పార్టీలకు వైఎస్ చెక్ పెట్టేసినట్లేనా..?
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రతో విపక్షాల వ్యూహాలకు అంతు చిక్కడం లేదు. సీఎం జగన్ బస్సు యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పర్యటనకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక వైపు ప్రజలో వస్తున్న స్పందన, రెండోవైపు పార్టీ నేతలు జోష్ నింపితూ ఎక్కడికక్కడే వ్యుహరచన చేస్తున్నారు. తాజాగా జగన్ బస్సు యాత్రతో విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తో్ందట.
నిన్న మొన్నటి వరకు పరదాల వీరుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేసిన విపక్షాల నేతలు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళడం వైసీపీకి అనుకున్నంత దానికంటే అధికంగా మైలేజ్ రావడంతో వైసీపీలో జోష్ నింపుతోంది. తాజాగా విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతం అయ్యింది. ఇతర పార్టీల నుంచి చేరికలు, బహిరంగ సభలు, ముఖాముఖీలు, రోడ్ షోలతో ఇప్పటి వరకు ఫుల్ జోష్‌తో ముందుకు వెళ్తున్న సీఎం జగన్ తాజాగా బస్సు యాత్రతో మరో దెబ్బ కొట్టారు. విపక్షాలు మేల్కొనే లోపు రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేశారట వైసీపీ అధినేత.
బస్సు యాత్రతో టీడీపి, జనసేన పార్టీలకు వైఎస్ జగన్ చెక్ పెట్టేశారట. తెర వెనుక ఉంటూనే రెండు పార్టీల ఊహకు అందని విధంగా అడుగులు వేశారు. ఒకవైపు ప్రజల్లో ఉంటూనే కూటమితో కలిసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్, చంద్ర బాబుకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అమలు చేస్తున్నారట. తన బస్సు యాత్రతో ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్, తాజాగా టీడీపి, జన సేన పార్టీకి భారీ దెబ్బ కొట్టారట. అందులో మొదట వరుసలో ఉంది జనసేన. దాదాపు జన సేన పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచిన రాష్ట్ర స్థాయిలో కీలక నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిన జగన్, తాజాగా జనసేన పార్టీకి భారీగానే పూడ్చుకోలేని నష్టాన్ని సీఎం జగన్ ఆపార్టీకి తెచ్చారట.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పార్టీ ముఖ్యనేతలతో పాటు నియోజకవర్గాల ఇంచార్జిలు, మండల స్థాయి ముఖ్య నేతలతో పాటు నియోజక వర్గంలో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ముఖ్య నేతలను వైసీపీలో ఆహ్వానించి పార్టీ కండువా కప్పేశారు సీఎం జగన్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు వారే అని దాదాపు డిసైడయిన 15 మందికి పైగా కీలక నేతలు అంతా వైసీపీలో చేరారట. టికెట్ ఇవ్వలేదని లేదన్న అసంతృప్తితో ఉన్న నేతలు ఆంతా అన్ కండీషనల్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండంతో ఇప్పుడు వీరంతా పవన్ కళ్యాణ్ కు ఏకుకు మేకై కూర్చున్నారట.
ఇక జన సేన పార్టీ మాత్రమే కాకుండా టీడీపీకి సైతం తన బస్సు యాత్రతో చెక్ పెడుతూ వస్తున్నారు సీఎం జగన్. టీడీపీ అధినేత వరుస పర్యటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వేళ ఆ పార్టీ క్రియా సీలక నేతలకు గాలం వేస్తోంది వైసీపీ. ఇప్పటికే టీడీపి నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరడంతో త్వరలోనే మరికొన్ని చేరికలు ఉండేలాగా వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందట. పొత్తుల పంచాయితీతో పాటు టీడీపీకి పట్టున్న నియోజవర్గం పరిధిలో అసంతృప్తులకు గాలం వేస్తోంది వైసీపీ. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలోపు మరికొన్ని చేరికలు వైసీపీలో ఉండేలా అడుగులు వేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…