AP-Telangana: మరో 3 రోజులు ఇదే చల్లదనం.. తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. నేటి నుంచి మాడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో కూడా రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP-Telangana: మరో 3 రోజులు ఇదే చల్లదనం.. తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్
Andhra Weather Report
Follow us

|

Updated on: Apr 20, 2024 | 4:14 PM

భానుడి ప్రతాపానికి బ్రేక్. మండే ఎండల్లో కూల్ న్యూస్.  తెలంగాణకు వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్. శనివారం(ఏప్రిల్ 20) నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చిరక జారీ చేసింది. ఈ వర్షాలు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయని.. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. శనివారం నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి,  మహబూబ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఖమ్మం, నారాయణపేట, కొమరంబీం ఆసిఫాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలు, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

అధికారులు చెప్పినట్లే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉక్కపోతతో అల్లాడిన జనాలకు రిలీఫ్ దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. కొన్ని చోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పంట చేతికొచ్చిన సమయంలో వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయి ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం పడింది.

ఇక ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలు కూల్‌ మోడ్‌లోకి వెళ్లాయి. ఎండలు నుంచి ఉపశమనం పొందుతున్నారు జనాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..