Student Death: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీ హాస్టల్‌లో కుప్పకూలి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి..!
నేటి యువ భారతం గుండె దడతో అల్లాడుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ.. ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. గుండెపోటు కారణంగా అకాల మరణాలు ఇటీవల అధికమయ్యాయి. 20 ఏళ్లకే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె ఆగింది. గుండెలో నొప్పితో హాస్టల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని తోటి విద్యార్థులు గమినించి, ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోని కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి శేరిగూడలోని శ్రీదత్త కాలేజీ హాస్టల్‌లో జరిగింది.
నల్గొ్ండ జిల్లా కొండ మల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి దేవరోని తండాకు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లమా EEE మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది సిద్దును హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు. చేతికందిన కొడుకు కళ్ళ ముందు విగతజీవిగా కనిపించడంతో సిద్దు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…