AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EC on Babu: టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

EC on Babu: టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!
Ap Ceo Meena Serious On Chandrababu
Balaraju Goud
|

Updated on: Apr 24, 2024 | 7:26 AM

Share

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈవో మీనా లేఖ రాశారు. బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఈవో మీనాకు వైసీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు, మరికొన్నింటికి స్పందించలేదు. అయితే చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను కూడా జత చేశారు.

ఏపీలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజాగళం పేరుతో నిర్వహిస్తోన్న ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి