Career Options after 10th Class: ‘పది’ తర్వాత కెరీర్ ప్లానింగ్‌ చేసుకోండిలా! బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు

10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని తదనుగుణమైన నిర్దిష్ట స్ట్రీమ్‌ను ఇంటర్‌లో ఎంచుకుంటారు. అయితే ఇంటర్‌ ఒక్కటే కెరీర్‌ ఆప్షన్‌ కాదు.. ఇంకా వృత్తి విద్యా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కోసం డిప్లొమా కోర్సు, పాలిటెక్నిక్ లేదా ITI..

Career Options after 10th Class: 'పది' తర్వాత కెరీర్ ప్లానింగ్‌ చేసుకోండిలా! బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు
Career Options After 10th Class
Follow us

|

Updated on: Apr 24, 2024 | 10:23 AM

ఏపీలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇక తెలంగాణలో ఏప్రిల్ 30న పదో తరగతి ఫలితాలు రానున్నాయి. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవలే 10వ తరగతి పరీక్షలు కూడా ముగిశాయి. టెన్త్‌ పూర్తి చూసిన విద్యార్ధులు తర్వాత ఏం కోర్సు చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్ధులకు (పది’ తర్వాత ఉన్న కెరీర్‌ ఆప్షన్ల గురించి పెద్దగా అవగాహన ఉండదు. టెన్త్‌ తర్వాత విద్యార్థులు 11వ తరగతిలో చదవడానికి ఎంచుకునే నిర్దిష్ట స్ట్రీమ్‌లు వారి కెరీర్‌ను నిర్ణయిస్తాయి. సైన్స్, కామర్స్, ఆర్ట్స్.. వీటిల్లో తమ అభిరుచినబట్టి ఆ దారిలో అడుగులు వేస్తుంటారు. 10వ తరగతి తర్వాత ఇంటర్‌ చదవాలనే నియమం ఏమీ లేదు. టెన్త్‌ పూర్తైన తర్వాత డిప్లొమా, వృత్తి విద్యా కోర్సులను కూడా అభ్యసించవచ్చు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో.. ఏయే ఉద్యోగాలు చేయవచ్చో.. స్టూడెంట్స్‌ గైడెన్స్‌ కోసం ఆ వివరాలు మీ కోసం..

‘పది’ తర్వాత పయనమెటు?

10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని తదనుగుణమైన నిర్దిష్ట స్ట్రీమ్‌ను ఇంటర్‌లో ఎంచుకుంటారు. అయితే ఇంటర్‌ ఒక్కటే కెరీర్‌ ఆప్షన్‌ కాదు.. ఇంకా వృత్తి విద్యా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కోసం డిప్లొమా కోర్సు, పాలిటెక్నిక్ లేదా ITI (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)ని కూడా ఎంచుకోవచ్చు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు.

10వ తరగతి తర్వాత ఏ యే కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే..

ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు, విద్యార్ధి ఆసక్తిని, అభిరుచిని ముందుగా అంచనా వేయాలి. ఎందుకంటే ఆసక్తికి సరిపోలని స్ట్రీమ్‌ని ఎంచుకుంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థులు ఏదైనా స్ట్రీమ్‌ని ఎంచుకునే వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కెరీర్ కౌన్సెలర్‌ల నుంచి కూడా సహాయం పొందవచ్చు. ఇక్కడ పదో తరగతి తర్వాత తీసుకోదగిన కొన్ని కోర్సుల వివరాలను అందిస్తున్నాం..

ఇవి కూడా చదవండి

డిప్లొమా

డిప్లొమాలు విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ సంస్థలు నిర్వహించే స్వల్పకాలిక కోర్సులివి. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత నేరుగా B.Tech లేదా BE కోర్సులో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరం అడ్మిషన్ పొందవచ్చు. ఈ కోర్సులకు కనీస అర్హత 10వ తరగతి వరకు గణితం, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండటం మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సులు ఇవే..

  • ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్‌లో డిప్లొమా
  • ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • ఫ్యాషన్ డిజైన్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ
  • గార్మెంట్ టెక్నాలజీలో డిప్లొమా
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ
  • ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్‌లో డిప్లొమా
  • లెదర్ టెక్నాలజీలో డిప్లొమా
  • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో డిప్లొమా
  • మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
  • మెరైన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ
  • డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
  • టెక్స్‌టైల్ డిజైన్‌లో డిప్లొమా
  • టెక్స్‌టైల్ ప్రాసెసింగ్‌లో డిప్లొమా
  • టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా (స్పిన్నింగ్)

ఐటీఐ కోర్సులు

వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ రంగాల నుంచి వివిధ సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ITI కోర్సులను ఏర్పాటు చేశాయి. ఈ కోర్సులు విద్యార్థులు ఉద్యోగం సంపాదించడానికి లేదంటే స్వయం ఉపాధి పొందేందుకు సహాయపడతాయి. అందుకే ఈ కోర్సులను వృత్తి విద్యా కోర్సులు అని కూడా అంటారు. ఈ కోర్సుల కాల వ్యవధి ఒకటి లేదా రెండు సంవత్సరాలు. కొన్ని ITI కోర్సుల వివరాలు మీ కోసం..

  • ఫిట్టర్
  • ఎలక్ట్రీషియన్
  • సర్వేయర్
  • ఐటీ టెక్నీషియన్
  • టూల్‌ అండ్‌ డైమేకర్
  • డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్)
  • డీజిల్ మెకానిక్
  • డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)
  • పంప్ ఆపరేటర్
  • మోటార్ డ్రైవింగ్ అండ్‌ మెకానిక్
  • టర్నర్
  • ఫూట్‌వేర్‌ మేకింగ్‌
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్ (ESM)
  • మెషినిస్ట్
  • హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కేర్‌
  • రిఫ్రిజిరేషన్‌ ఇంజనీర్
  • ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్ ప్రాసెసింగ్
  • మెకానిక్‌ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్
  • బ్లీచింగ్ డైయింగ్ అండ్‌ కాలికో ప్రింటింగ్
  • వెసెల్ నావిగేటర్
  • వేవింగ్‌ టెక్నీషియన్‌
  • ఫైర్‌ మ్యాన్‌
  • క్యాబిన్ లేదా రూమ్ అటెండెంట్
  • కంప్యూటర్-ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్‌ డిజైనింగ్
  • కార్పొరేట్ హౌస్ కీపింగ్
  • కౌన్సెలింగ్
  • క్రెచ్ మేనేజ్‌మెంట్
  • డ్రైవర్ అండ్‌ మెకానిక్ (లైట్ మోటర్ వెహికల్)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్
  • డొమెస్టిక్ హౌస్ కీపింగ్
  • ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్
  • ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్
  • హాస్పిటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్
  • ఇన్స్టిట్యూషన్ హౌస్ కీపింగ్
  • బీమా ఏజెంట్
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్
  • మెడికల్ ట్రాన్స్క్రిప్షన్
  • నెట్‌వర్క్ టెక్నీషియన్
  • ఓల్డ్ ఏజ్ కేర్ అసిస్టెంట్
  • పారా లీగల్ అసిస్టెంట్ లేదా మున్షీ
  • ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్)
  • స్పా థెరపీ
  • టూరిస్ట్‌ గైడ్‌
  • బేకర్ అండ్‌ కన్‌ఫెక్షనర్
  • వెబ్ డిజైనింగ్ అండ్‌ కంప్యూటర్ గ్రాఫిక్స్
  • కేన్‌ విల్లో అండ్‌ బాంబూ వర్కర్‌
  • క్యాటరింగ్ అండ్‌ హాస్పిటాలిటీ అసిస్టెంట్
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
  • క్రాఫ్ట్‌ మ్యాన్‌ ప్రొడక్షన్‌ (జనరల్)
  • క్రాఫ్ట్‌ మ్యాన్‌ ప్రొడక్షన్‌ (శాఖాహారం)
  • కట్టింగ్ అండ్‌ స్యూయింగ్
  • డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్
  • డ్రెస్ మేకింగ్
  • సర్ఫేస్‌ ఆర్నమెంటేషన్‌ టెన్నిక్స్‌ (ఎంబ్రాయిడరీ)
  • ఫ్యాషన్ డిజైన్ అండ్‌ టెక్నాలజీ
  • ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్
  • ఫైర్ టెక్నాలజీ
  • ఫ్లోరీ కల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్‌
  • బేసిక్‌ కాస్మోటాలజీ
  • హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌
  • హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్
  • హార్టికల్చర్
  • హాస్పిటల్ హౌస్ కీపింగ్
  • హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్
  • లెదర్ గూడ్స్ మేకర్
  • లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్
  • మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
  • మల్టీమీడియా యానిమేషన్ అండ్‌ స్పెషల్ ఎఫెక్ట్స్
  • ఆఫీస్ అసిస్టెంట్ అండ్‌ కంప్యూటర్ ఆపరేటర్
  • ఫోటోగ్రాఫర్
  • ప్లేట్‌మేకర్ అండ్‌ ఇంపోస్టర్‌
  • ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌
  • ప్రాసెస్ కెమెరామెన్
  • సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లీష్)
  • స్టెనోగ్రాఫర్ అండ్‌ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)
  • లేబొరేటరీ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్
  • ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మాన్షిప్
  • రిసోర్స్ పర్సన్
  • డ్రాయింగ్/మ్యాథ్స్‌
  • డైరీయింగ్

సర్టిఫికేట్ కోర్సులు

సర్టిఫికేట్ కోర్సులు రెండు, మూడు లేదా ఆరు నెలల పాటు ఉండే స్వల్పకాలిక కోర్సులు. 10వ తరగతి తర్వాత తీసుకోదగిన కొన్ని సర్టిఫికెట్ కోర్సులు ఇవే..

  • ఫుడ్ ప్రాసెసర్ టెక్నీషియన్
  • కార్డియాక్ కేర్ టెక్నీషియన్
  • చిల్లింగ్ ప్లాంట్ టెక్నీషియన్
  • హోమ్ హెల్త్ ఎయిడ్ శిక్షణ
  • టూరిస్ట్ గైడ్ శిక్షణ
  • ప్లంబింగ్
  • కార్పెంటరీ
  • తాపీపని
  • బార్ బెండర్
  • ట్రాక్టర్ మెకానిక్
  • కారు మెకానిక్
  • డేటా ఆపరేటర్
  • గ్రీన్హౌస్ ఫిట్టర్
  • సెట్ టాప్ బాక్స్ టెక్నీషియన్
  • బ్యూటీ అండ్‌ మేకప్‌
  • బుక్ కీపింగ్
  • పౌల్ట్రీ ఫార్మింగ్‌

పదో తరగతి తర్వాత ఏయే ఉద్యోగాలు చేయొచ్చంటే..

పదో తరగతి తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర శాఖలు అందించే వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి కనీస విద్యార్హత. రైల్వేలు, రక్షణ, పారామిలిటరీ, ప్రైవేట్ సంస్థలు వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..