AP SSC State1st Ranker 2024: ‘టెక్ట్స్ బుక్స్ చదివాను.. వారికి నేనివ్వగలిగిన గొప్ప బహుమతి నేను తెచ్చుకునే మార్కులే’ టెన్త్ టాపర్ మనస్వి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో 86.69 శాతం (5,34,574 ) ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ఫస్ట్, కర్నూలు జిల్లా లాస్ట్‌లో నిలిచాయి. తాజా ఫలితాల్లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంక్..
ఏలూరు, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో 86.69 శాతం (5,34,574 ) ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ఫస్ట్, కర్నూలు జిల్లా లాస్ట్‌లో నిలిచాయి. తాజా ఫలితాల్లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంక్ సాధించి అందరి దృష్టి ఆకర్షించింది. మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. ఒక్క సెకండ్ ల్యాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు పొందింది. హిందీలో ఒక్కమార్కు తగ్గడంతో వందకు 99 మార్కులు వచ్చాయి.
మనస్వి నేపథ్యం ఇదీ..
పదోతరగతిలో రాష్ట్రస్థాయిలో ఏటా ఎవరో ఒకరు రికార్డు మార్కులు సాధిస్తారు. ఈసారి మాత్రం ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణానికి చెందిన అమ్మాయి ఆకుల వెంకట నాగసాయి మనస్వి సాధించింది. 600కి ఒక్క మార్కు తక్కువగా 599 మార్కులు తెచ్చుకుని రికార్డు సృష్టించింది. మనస్వి తల్లి నాగ శైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు. ఇద్దరూ గవర్నమెంట్ స్కూల్ టీచర్లే. మనస్వి వారి ఏకైక సంతానం. మనస్వి పుస్తకాలు చదవడం అంటే మహా ఇష్టం. క్లాసు పుస్తకాలే కాకుండా ఇతర మంచి సబ్జెక్టు ఉన్న పుస్తకాలు కూడా చదువుతుంది.
మా నాన్నే నా హీరో..
నా రోల్ మోడల్ ఏపీజే అబ్దుల్ కలామ్. క్రికెట్ అంటే ఇష్టం కానీ ఆడడానికి టేం లేదు. టీవీలో మ్యాచ్ చూస్తాను. విరాట్ కోహ్లీ ఆట బాగుంటుంది. సినిమాలు తక్కువగా చూస్తా. నాకు రామ్ చరణ్ ఇష్టం. వీటన్నింటికంటే ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్నే. మా నాన్నే బెస్ట్ హీరో. నాన్న ఎప్పుడూ ఖాళీగా ఉండరు. మా నాన్న పాతికేళ్ల కిందట డీఎస్సీ రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దాంతో ట్యూషన్‌లు, వ్యవసాయం ఇలా ఎన్నో పనులు చేశారు. 2023లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చే వరకు నిరాశపడకుండా ఎదురుచూశారు అంటూ తండ్రి గురించి ఆనందంగా చెప్పింది.
ఇలా చదివాను..
టెన్త్ క్లాస్ మార్కులు మనకు జీవితమంతా తోడుంటామి. టెన్త్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మాత్రమే కాదు చదువు మీద మనకున్న ఇష్టానికి అద్దంపడుతుంది. అందుకే కష్టపడి చదివాను. మా అమ్మానాన్న నా కోసం తీసుకుంటున్న శ్రద్ధకు ప్రతిఫలంగా వారికి నేనివ్వగలిగిన గొప్ప బహుమతి నేను తెచ్చుకునే మార్కులే. టెన్త్ ప్రిపరేషన్‌లో గైడ్‌లు, నోట్స్ కన్నా.. ఎక్కువగా టెక్ట్స్‌బుక్స్ చదివాను. టాపర్ అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు గానీ మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకున్నాను. ఆశించిన దానికన్న మంచి ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. నాకు మ్యాథ్స్ ఇష్టం. ఐఐటీలో ఇంజినీరింగ్ చేయాలనేది నా లక్ష్యం.. టెన్త్ క్లాస్ స్టేట్ టాపర్ మనస్వి చెప్పుకొచ్చింది. తాను ఆశించిన స్థాయికి ఎదగాలని మనం కూడా నిండు మనసుతో ఆశీర్వాదం ఇద్దాం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.