Muslim Reservation: ఏపీలో చిచ్చురాజేసిన ముస్లిం రిజర్వేషన్లు.. వైసీపీ – కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాతా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్‌ చేసింది.

Muslim Reservation: ఏపీలో చిచ్చురాజేసిన ముస్లిం రిజర్వేషన్లు.. వైసీపీ - కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
Ap Politics On Muslim Reservation
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:11 AM

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాతా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్‌ చేసింది. కూటమి తరపున ఉమ్మడి ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ సూటిగానే ప్రశ్నిస్తోంది. 4 శాతం రిజర్వేషన్ల అంశంపై వైఖరి చెప్పాకే ఓట్లు అడగాలి అంటూ డిమాండ్‌ చేస్తోంది.

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం తీవ్రస్థాయిలోనే చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రకటించినప్పుడు.. ఏపీకీ అదే వర్తిస్తుందనే వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నారు. ఇటీవల దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ఎక్కడా మాట్లాడలేదని, కూటమిని టార్గెట్ చేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే, ఈ విషయంలో బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. IYR కృష్ణారావు లాంటి వారు ఏపీ బీజేపీ నాయకత్వం తీరును బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పినట్టే.. ఏపీలోనూ ఉండాలంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల దుమారం కాకరేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?