Summer Holidays 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే!
తెలుగు రాష్ట్రాల్లోన్ని విద్యా సంస్థలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు..
అమరావతి, ఏప్రిల్ 24: తెలుగు రాష్ట్రాల్లోన్ని విద్యా సంస్థలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ ఏప్రిల్ 23వ తేదీతో చివరి పనిదినం ముగిసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న బడులు తిరిగి ప్రారంభం అవుతాయి.
వేసవి సెలవుల కాలంలో రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని, ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు హెచ్చరించాయి. రెండు రాష్ట్రాల్లో జూన్ 12 నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్ 2 పరీక్షల ఫలితాలను ఆయ స్కూళ్లలో మంగళవారమే ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకునే ముందు తల్లిదండ్రులు సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు.
మరోవైపు మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.