Jagan Bus Yatra: అక్కవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు.. జగన్ నామినేషన్ ఎప్పుడంటే..?
వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. రేపు పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. రేపు పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా అక్కివలసలో 22వ రోజు బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కోటబొమ్మాళి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు.
సాయంత్రం లంచ్ క్యాంప్ నుంచి అక్కవరం చేరుకుని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కవరం హెలిప్యాడ్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. రేపు ఏఫ్రిల్ 25న పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు సీఎం వైఎస్ జగన్. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే… అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు సీఎం జగన్. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతోంది.
మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. సభలూ, వివిధ వర్గాలతో ముఖాముఖీలు, రోడ్ షోలు, జనానికి ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్ బస్సు యాత్ర సాగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మండుటెండలోనూ సీఎం జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. సీఎం జగన్‌ను చూసేందుకు వచ్చేవాళ్లు కొందరైతే… ఆయనతో చేయి కలిపేందుకు వచ్చేవాళ్లు మరికొందరు.. తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చేవాళ్లు ఇంకొందరు. ఇలా అందరినీ పలకరిస్తూ, అందరి సమస్యలు వింటూ… నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు సీఎం జగన్. ఇప్పటివరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో సాగిన బస్సు యాత్రలో 15 భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు జగన్.
వై నాట్ 175 అంటోన్న వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…