TSBIE Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి
TS Intermediate Result 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు..

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే మార్కుల మెమోను కూడా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షలకు ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 4,78,527 మంది హాజరుకాగా.. సెకండ్ ఇయర్‌లో 4,43,993 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు మూల్యాంకనం ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే మరో పది రోజుల్లోనే డీకోడింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన ఇంటర్ బోర్డు త్వరిత గతిన ఫలితాలను వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60.01 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 64.16 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. తాజా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే ముందంజలో ఉన్నారు.
తెలంగాణ ఇంటర్ 2024 ఫలితాలు విడుదల
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.