Andhra Pradesh: అద్దంకి సీఐ రాసలీలు.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆడియో టేపులు.. మహిళలను లోబర్చుకొని..
Addanki CI Audio Tape: అద్దంకి సీఐ రాసలీల ఆడియో నెట్టింట వైరల్‌గా మారాయి. మహిళలను వేధించడమే కాకుండా మగాణ్ణంటూ అగౌరవంగా మాట్లాడుతున్న ఆడియో టేపులు బయటకొచ్చాయి. తనపై కక్షతోనే ఫేక్ ఆడియోలు సృష్టించారంటూ వివరణ ఇచ్చారు సీఐ రోశయ్య.

Addanki CI Audio Tape: బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో చీరాల సిఐగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సీఐ ప్రవర్తనతో ఓవ్యక్తి ఉరివేసుకుని చనిపోతున్నట్లు చీరాలలో సెల్పీ వీడియో తీసి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని.. అలాగే వివిధ కారణాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల్ని లోబర్చుకుని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిఐపై ఆరోపణలు చేస్తూ కొంతమంది నెట్టింట్లో పెట్టిన ఆడియో క్లిప్‌లు పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారాయి. తనతో మాట్లాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓమహిళను బెదిరిస్తున్న ఆడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది.
తన ఆడియోలపై వస్తున్న వార్తలపై కానిస్టేబుల్‌తో సెటెరికల్‌గా స్పందించిన సీఐ ఆడియో మరోకటి బయటకు వచ్చింది. వాళ్ళ దగ్గర ఆడియో లేకపోతే చెప్పు.. నేను ఆ పనిలో ఉన్నప్పుడు చెబుతా వచ్చి వీడియోలు తీసుకోమను. అవి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి.. నేను మగాణ్ణి అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడిన మరో ఆడియోలు బయటకు వచ్చింది.
అయితే, ఆడియోల కలకలంపై స్పందించారు అద్దంకి సిఐ రోశయ్య. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు, ఆడియో టేపుల బహిర్గతం వెనుక అద్దంకి పట్టణానికి చెందిన మద్యం వ్యాపారి బాలచందర్ హస్తం ఉందని చెబుతున్నారు. అతనిపై మద్యం కేసు బుక్ చేశానన్న కక్షతో ఇలాంటి ఫేక్ ఆడియోలు సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు సీఐ రోశయ్య.




బహిరంగంగా సీఐపై ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని కొందరంటున్నారు. మహిళలను వేధించే సీఐపై చర్యలు తీసుకోవాలని లేకుంటే పోలీసుశాఖకు ఇలాంటివి మాయనిమచ్చగా మిగిలిపోతాయంటున్నారు. సీఐ రోశయ్య ఆగఢాలు పెచ్చుమీరుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
