Bapatla: నేడు రేపల్లెకు టీడీపీ అధినేత.. అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న చంద్రబాబు..
పదవ తరగతి చదువుతున్న ఉప్పాల అమర్‌నాథ్ అనే బాలుడి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దీంతో బాపట్ల వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. బాలుడి అక్కను వేధిస్తున్నారని నిలదీసినందుకే..
పదవ తరగతి చదువుతున్న ఉప్పాల అమర్‌నాథ్ అనే బాలుడి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దీంతో బాపట్ల వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. బాలుడి అక్కను వేధిస్తున్నారని నిలదీసినందుకే.. ఆ బాలుడిపై పెట్రోలు పోసి హత్య చేశారంటూ ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. బాపట్ల జిల్లాలోని ఉప్పలవారిపాలెంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అమర్‌నాథ్‌పై పెట్రోల్ పోసి నిప్పుంటిచి హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాస్తారోకో నిర్వహించారు. బాలేడే అమర్నాథ్ మృతదేహాన్ని రాజోలుకు తీసుకువెళ్తుండగా.. చెరుకుపల్లి వద్ద అడ్డుకుని నిరసన చేపట్టారు. డెడ్ బాడీని నేషనల్ హైవేపై ఉంచి ధర్నా చేశారు.
రేపు రేపల్లెకు టీడీపీ అధినేత చంద్రబాబు..
హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబ సభ్యులను టీపీడీ అధినేత చంద్రబాబు పరామర్శించనున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారి పాలెంలో హత్యకు గురైన 10 వ తరగతి విద్యార్థి అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు మృతుని ఇంటికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..