Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగి ఆటకట్టించిన రోగి.. చివరికి
గుంటూరు జీజీహెచ్‌కి నిత్యం అనేక మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. దాదాపు పదిహేను వందల బెడ్స్ ఉన్న రిఫరల్ ఆసుపత్రి ఇది. ప్రతిరోజూ సుమారు మూడు వేల మంది ఓపి రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వీరందరిలాగే ఈరోజు ఒక మహిళ ఆర్ధోపెడిక్ ఓపీ విభాగానికి వచ్చింది. చేతివేలు విరిగిపోవడంతో కట్టు కట్టించుకోవడానికి వచ్చింది. అయితే అది కట్టుకడుతున్న సమయంలో నర్సింగ్ ఉద్యోగి ఐదు వందల రూపాయలివ్వాలని డిమాండ్ చేసింది.

గుంటూరు జీజీహెచ్‌కి నిత్యం అనేక మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. దాదాపు పదిహేను వందల బెడ్స్ ఉన్న రిఫరల్ ఆసుపత్రి ఇది. ప్రతిరోజూ సుమారు మూడు వేల మంది ఓపి రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వీరందరిలాగే ఈరోజు ఒక మహిళ ఆర్ధోపెడిక్ ఓపీ విభాగానికి వచ్చింది. చేతివేలు విరిగిపోవడంతో కట్టు కట్టించుకోవడానికి వచ్చింది. అయితే అది కట్టుకడుతున్న సమయంలో నర్సింగ్ ఉద్యోగి ఐదు వందల రూపాయలివ్వాలని డిమాండ్ చేసింది. అయితే కట్టు కట్టించుకున్న మహిళ తిరిగి వెళుతున్న సమయంలోనే జీజీహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ వార్డుకు వచ్చారు. ఆ మహిళ రోగిని పలకరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ రోగి అన్ని బాగానే ఉన్నాయని.. కానీ సిబ్బంది లంచం అడగటంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పింది.
దీంతో సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కట్టు కట్టిన నర్సింగ్ ఉద్యోగిని పిలిపించారు. ఆమెను అనేక ప్రశ్నలు అడిగిన అనంతరం ఆమె అసలు జీజీహెచ్ ఉద్యోగే కాదని తేల్చారు. కాంతమ్మ అనేక మహిళ గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు నటిస్తూ రోగుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈరోజు కూడా కాంతమ్మే డబ్బులు అడిగినట్లు తేలింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను ఎవరూ తీసుకొచ్చారో ఎప్పటి నుండి ఉద్యోగం చేస్తుందో తేల్చాలని విచారణకు ఆదేశించారు.
అసలు ఉద్యోగులు కాని వాళ్ల వల్లే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వారిని జలగల్లా సిబ్బంది పిడిస్తున్నారని మండిపడ్డారు. కాంతమ్మను తక్షణమే జీజీహెచ్‌ను విడిచి పెట్టి వెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో వార్డులోని సిబ్బందిని కూడా హెచ్చరించారు. ఉద్యోగులు కాని వాళ్లు కూడా విధులు నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరిగితే వార్డు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఆస్పత్రిలో అటెండర్లు పనిచేస్తున్న కొంతమంది లంచాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రిలో లక్షల ఫీజులు చెల్లించలేకే ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. అయితే చివరికి అక్కడ కూడా కొంతమంది లంచాలు తీసుకోవడానికి మొగ్గు చూపడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా లంచాలు అడిగే వారిని విధుల నుంచి తీసివేయాలంటూ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
