Andhra Pradesh: ఆ సమస్యలు తీరుతాయని కొన్నేళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న ఊరి ప్రజలు..
కర్నూలు జిల్లా వింత ఆచారాలకు, పద్ధతులకు నిలువు. ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కుడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో మూఢనమ్మకం అనాలో అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటింది.

కర్నూలు జిల్లా వింత ఆచారాలకు, పద్ధతులకు నిలువు. ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కుడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో మూఢనమ్మకం అనాలో అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటింది. పిల్లలు నేలపై పడుకోబెడితే వారిని దాటుకుంటూ,అనేకమంది గోవిందా గోవిందా అంటూ నామస్మరణాలు చేస్తూ పరుగులు పెడతారు. పరిగెత్తే వారు చేసే నినాదాలు పిల్లలు భయబ్రాంతులకు గురి చేస్తాయి. అయితే మిగిలిన ప్రజలకు అది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం. ఒక పక్క గుక్క తిప్పుకోలేక ఏడుస్తున్న చిన్నారుల గోడును పట్టించుకునే వారే ఉండరు. చిన్న పిల్లలే కాదు పెద్ద వారు కూడా నేలపై బొక్క బోర్లా పడుకుంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలో కొలువై ఉన్న శ్రీ గుంటి రంగా స్వామి ఆలయంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెల్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలో ప్రతి ఏటా శ్రావణమాసం వచ్చే మొదటి శనివారానికి ముందు శుక్రవారం అర్ధరాత్రి వెంకపురం కాలనీ నుండి సుమారు వేయి మంది కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు కేకలు వేస్తూ పరుగులు పెడతారు భక్తులు. 60 కిలోమీటర్ల మేర ఇలా సందడి చేస్తూ, కాలినడకన వెళ్లి నాగులాదిన్నె దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి వెళ్లి నీటి జలాన్ని సేకరిస్తారు. ఆ నీటిని తెచ్చి వెంకటాపురం కాలనిలోని గుంటిరంగా స్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు. స్వామిని అభిషేకించాక పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి అరుపులు కేకలు వేస్తూ గోవింద నామస్మరణలు చేస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఇలా ఐదు సార్లు ప్రదక్షణలుచేస్తారు.
అలా నది జలాలతో తిరిగితే గుడిలో కొలువై ఉన్న స్వామినే ఇలా గుడి చుట్టూ తిరుగుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ సమయంలో శారీరక, మానసిక, బాధతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ పడుకుంటారు. అలా పడుకున్న వారిపై నుండి నది జలాలు తెచ్చిన వారు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో వారి కాలి దూళి తగిలి, తమ మీద నుండి వెళితే వ్యాధులు నయం అవుతాయని వారి నమ్మకం. ఆయుధాలు పట్టుకొని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం. తరతరాలుగా వస్తున్నా ఈ ఆచారాన్ని ఇప్పటికి అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమావన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
