AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ సీనియర్ పొలిటీషియన్ చూపు పక్క జిల్లా మీద పడిందా? లేక…

ఆ సీనియర్ పొలిటీషియన్ చూపు పక్క జిల్లా మీద పడిందా? లేక పార్టీనే కీలక నిర్ణయం తీసుకుందా? ఆ జిల్లా పై పూర్తి స్థాయి పట్టు సాధించడమే టార్గెట్‌గా విపక్ష పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుందా? పూర్వ వైభవం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోందా? ఇంతకీ పొరుగు జిల్లా పై కన్నేసిన ఆ సీనియర్ నేత ఎవరు? ఆయనకున్న బలాబలాలు ఏంటి..? ఎక్కడైనా నెగ్గుకువచ్చే సత్తా ఆయనకు ఉందా..? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి...

AP News:  ఆ సీనియర్ పొలిటీషియన్ చూపు పక్క జిల్లా మీద పడిందా? లేక...
Telugu Desam Party
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2023 | 10:10 PM

Share

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 19:  ఒకప్పుడు టీడీపీ కంచుకోట విజయనగరం జిల్లా. ప్రతీ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ తన హవా చాటుకుంటూ వస్తోంది. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్‌ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ. ఇక్కడ ఫ్యాన్ వేవ్‌తో పాటు పార్టీపరమైన తప్పిదాలతో కోలుకోలేని దెబ్బతింది టీడీపీ. ఆ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటును కైవసం చేసుకుని విజయనగరాన్ని క్లీన్‌స్వీప్‌ చేసింది వైసీపీ. మంత్రి బొత్స, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీనుల నాయకత్వంతో తర్వాత జిల్లాలో పార్టీ ఇంకా బలపడింది. దీంతో ఇప్పుడు టీడీపీ ఒకప్పటి తన కంచుకోటపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్లాలన్న ఆలోచనతో ఉంది విపక్షపార్టీ.

విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల ఇంచార్జిల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కాస్త గట్టిగానే వ్యవహరిస్తోంది టీడీపీ. కాపు, కొప్పల వెలమలు అధికంగా ఉండే జిల్లాలో ఈసారి కొప్పల వెలమ సామాజికవర్గానికి రెండు సీట్లు ఇచ్చేలా వర్కవుట్ చేస్తోంది. అలాగే జిల్లాలో బొత్స కుటుంబాన్ని సమర్థంగా ఢీకొట్టగల బలమైన నాయకుడిని విజయనగరం పార్లమెంట్‌ స్థానంనుంచి పోటీకి దించాలనుకుంటోందట టీడీపీ. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఈసారి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టొచ్చన్న ప్రచారం బలంగా జరుగుతోంది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో గంటాకు ప్రత్యేక ముద్ర ఉంది. అంగ, అర్ధబలమున్న నేత కావడంతో జిల్లాలో పార్టీకేడర్‌కి గంటా అభ్యర్థిత్వం ఒక బూస్ట్‌లా ఉంటుందన్న వ్యూహంతో ఆ దిశగా అడుగులేస్తోందట టీడీపీ.

ఓటమి ఎరుగని నాయకుడిగా గంటాకు గుర్తింపు ఉంది. పైగా ఆయన కాపు సామాజికవర్గ నేత కావడంతో ఆ వర్గం ఎక్కువగా ఉన్న విజయనగరంలో సామాజిక సమీకరణాలు కూడా కలిసొస్తాయని డిసైడ్‌ అయిందట టీడీపీ నాయకత్వం. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ గంటా అభ్యర్థిత్వానికి ఎక్కువమంది మొగ్గుచూపినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గంటా పేరు దాదాపు ఖరారైనట్లే భావిస్తున్నారు. అంతా బానే ఉన్నా.. జిల్లా తెలుగుదేశం సుప్రీం అశోక్ గజపతి రాజు… గంటాని అంగీకరిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతితో కొంత గ్యాప్ నడిచింది. దీంతో గంటా అభ్యర్థిత్వానికి సీనియర్‌ ఎంతవరకు మద్దతిస్తారన్న అనుమానం కొందరికుంది.

గంటా వర్గంగా పేరున్న మాజీ ఎమ్మెల్యేలు కేఏ నాయుడు, మీసాల గీత విజయనగరం జిల్లాలో అశోక్‌గజపతిరాజు వ్యతిరేకవర్గంగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేసి, కేంద్రమంత్రిగా కూడా కీలక బాధ్యతలు చేపట్టిన అశోక్‌గజపతిరాజు ఈసారి ఎంపీగా పోటీచేస్తానని పట్టుబడితే పరిస్థితేంటన్నది మరో ప్రశ్న. ఇలా అనేక రాజకీయ సమీకరణాల మధ్య గంటా జిల్లాకొస్తే అశోక్‌గజపతి ఎలా స్పందిస్తారన్నది పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎలాగైనా జిల్లాలో పార్టీని బలంగా తయారు చేయాలన్న పట్టుదలతో ఉన్న అధిష్ఠానం అశోక్ గజపతికి సర్దిచెబుతుందా? లేదంటే ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చి జిల్లాలో వైసీపీకి చెక్‌ పెడుతుందో చూడాలి. మొత్తానికైతే విజయనగరం పాలిటిక్స్‌లోకి గంటా ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ అయితే బలంగానే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం..
చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం..
సినిమాలే కాదు.. మరో విషయంలోనూ రికార్డు క్రియేట్ చేసిన రష్మిక
సినిమాలే కాదు.. మరో విషయంలోనూ రికార్డు క్రియేట్ చేసిన రష్మిక
మరీ ఇలా ఉన్నారేంట్రా? 'ది రాజసాబ్' థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో
మరీ ఇలా ఉన్నారేంట్రా? 'ది రాజసాబ్' థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?