Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..

Weather Report: ఆగస్టు నెల ఫస్టాప్ మొత్తం వాన ఊసే లేదు. సెకండాఫ్‌లో ఓ మోస్తరుగా మొదలై దంచికొడతానంటోది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానాకాలం మళ్లీ మొదలైనట్టైంది. మరో రెండురోజుల పాటు ఇదే విధంగా వర్షం కొనసాగుతుందని, ఐదు రోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగునాట వాతావరణం పొడిగా మారుతుందని చెబుతోంది వాతావరణశాఖ. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపు చినుకు సందడి చేస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో..

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..
Weather Forecast
Follow us

|

Updated on: Aug 19, 2023 | 11:50 PM

ఆగస్టు నెల ఫస్టాప్ మొత్తం వాన ఊసే లేదు. సెకండాఫ్‌లో ఓ మోస్తరుగా మొదలై దంచికొడతానంటోది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానాకాలం మళ్లీ మొదలైనట్టైంది. మరో రెండురోజుల పాటు ఇదే విధంగా వర్షం కొనసాగుతుందని, ఐదు రోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగునాట వాతావరణం పొడిగా మారుతుందని చెబుతోంది వాతావరణశాఖ. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపు చినుకు సందడి చేస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి.

రాగల 24 గంటల్లో అంటూ తెలుగు రాష్ట్రాలను భారీ వర్ష హెచ్చరికలు భయపెడుతున్నాయి. తెలంగాణకు గ్యాప్‌ ఇచ్చి మళ్లీ వచ్చాయి వర్షాలు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.

ఇప్పటికే ఉత్తర తెలంగాణలో చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లాలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అటు… హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇదే ముసురు మరో రెండురోజుల పాటు కొనసాగవచ్చు. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ సహా మొత్తం 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక ఏపీకి సంబంధించి కోస్తా జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నందువల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజుల్లో పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్సుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..