Bike Theft: ఎంత సింపుల్‌గా బైక్‌లు కొట్టేస్తున్నారో చూడండి.. వైరల్ వీడియో.

Bike Theft: ఎంత సింపుల్‌గా బైక్‌లు కొట్టేస్తున్నారో చూడండి.. వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 19, 2023 | 8:52 PM

హైదరాబాద్‌ మహానగరంలో రాత్రిపూట ఇంటి ముందర వెహికల్ పెట్టి నిద్రపోతున్నారా.. జరభద్రం..! ఎందుకంటే బైక్ దొంగ‌లు వస్తున్నారు..! పార్క్ చేసిన వాహనాలే టార్గెట్‌‌గా చోరీలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా వాహనాలు పార్క్ చేసి ప‌నుల‌ కోసం లోప‌ల వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగ‌త‌నానికి గురి కావడంతో ల‌బోదిబోమంటూ పోలీస్ స్టేష‌న్ మొట్లు ఎక్కుతున్నారు.

హైదరాబాద్‌ మహానగరంలో రాత్రిపూట ఇంటి ముందర వెహికల్ పెట్టి నిద్రపోతున్నారా.. జరభద్రం..! ఎందుకంటే బైక్ దొంగ‌లు వస్తున్నారు..! పార్క్ చేసిన వాహనాలే టార్గెట్‌‌గా చోరీలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా వాహనాలు పార్క్ చేసి ప‌నుల‌ కోసం లోప‌ల వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగ‌త‌నానికి గురి కావడంతో ల‌బోదిబోమంటూ పోలీస్ స్టేష‌న్ మొట్లు ఎక్కుతున్నారు. నగర వ్యాప్తంగా అడుగడునా సీసీ కెమెరాలు ఉన్నా.. ఏమాత్రం జంక‌ు బొంకు య‌ధేచ్చగా దొంగ‌త‌నం చేసేందుకు వెన‌కాడ‌టం లేదు బైక్ దొంగ‌లు. తాళం వేసిన ఇళ్లలోనే కాదు. లాక్‌ చేసి పార్క్‌ చేసిన వాహనాలను కూడా వదలడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. అంతే ఆ బైక్ పై దొంగ కన్ను పడింది. చాకచక్యంగా బైక్ హ్యాండిల్ విరగొట్టి ఎత్తుకెళ్లాడు. కాలితో ఒక్క తన్నుతో హ్యాండిల్ లాక్ ఊడిపోయింది. బైక్ తీసుకుని అక్కడి నుంచి తుర్రుమని జారుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసుల బైక్ దొంగ కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...