Hyderabad: పాతబస్తిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా పక్కకు ఒరిగిన భవనం
హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. బహదూర్‌పురాలో ఒక్కసారిగా భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ సమీపంలోని బహదూర్పురా హోసింగ్ బోర్డ్ కాలనీలో ఓ 4 అంతస్తు భవనం నిర్మాణంలో ఉంది. అయితే అది ఒక్కసారిగా పక్కకు ఒరగండో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆ ఏరియా కార్పొరేటర్ హుస్సేని పాషా ఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టు ప్రక్కల వారిని ఖాళీ చేయించారు.
హైదరాబాద్ న్యూస్, ఆగస్టు 20 : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. బహదూర్‌పురాలో ఒక్కసారిగా భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ సమీపంలోని బహదూర్పురా హోసింగ్ బోర్డ్ కాలనీలో ఓ 4 అంతస్తు భవనం నిర్మాణంలో ఉంది. అయితే అది ఒక్కసారిగా పక్కకు ఒరగండో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆ ఏరియా కార్పొరేటర్ హుస్సేని పాషా ఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టు ప్రక్కల వారిని ఖాళీ చేయించారు.
ఆ 4 అంతస్తుల భవనం అక్రమ నిర్మాణం జరిగింది అని జీహెచ్‌ఎంసీ అధికారులు బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యజమాని పై కేస్ నమోదు చేసిన బహదూర్పురా పోలీసులు.. భవనాన్ని కూల్చివేయడానికి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి యజమాని 27లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కొన్ని మెషినరీలు బెంగళూరు నుండి వస్తున్నాయని.. ఆదివారం నాటికి చుట్టుప్రక్కల నిర్మాణాలకు ఎలాంటి హాని కలగకుండా కూల్చివేత జరుగుతుంది పేర్కొన్నారు. అలాగే చుట్టుప్రక్కల ఉన్నవారు కొంతమంది తమ బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారని ఇటు వైపు ఎవరు రాకుండా పోలీసులు బందోబస్తు చేస్తున్నట్లు కిషన్ బాగ్ కార్పొరేటర్ హుస్సేని పాషా కిషన్ బాగ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..