Andhra Pradesh: నకిలీ బంగారంతో బ్యాంకులో లోన్ తీసుకున్న దుండగులు.. ఎలా దొరికారో తెలిస్తే షాక్ అవ్వాల్సందే
గుంటూరులో నకిలీ బంగారంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురజాల పట్టణంలోని ఒక బ్యాంక్ కు సాధారణ ఖాతాదారుడిలానే ఒక వ్యక్తి వచ్చాడు. గోల్డ్ లోన్ కావాలని అడిగాడు. బ్యాంక్ సిబ్బంది సరేనంటూ బంగారు ఆభరణాలైన గాజులను చెక్ చేశారు. అన్ని బాగానే ఉన్నాయనుకున్న సిబ్బంది ఖాతాదారుడికి లక్షన్నర రూపాయల రుణం ఇచ్చారు. అనంతరం అక్కడ నుండి ఖాతాదారుడు వెళ్లిపోయాడు.

గుంటూరులో నకిలీ బంగారంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురజాల పట్టణంలోని ఒక బ్యాంక్ కు సాధారణ ఖాతాదారుడిలానే ఒక వ్యక్తి వచ్చాడు. గోల్డ్ లోన్ కావాలని అడిగాడు. బ్యాంక్ సిబ్బంది సరేనంటూ బంగారు ఆభరణాలైన గాజులను చెక్ చేశారు. అన్ని బాగానే ఉన్నాయనుకున్న సిబ్బంది ఖాతాదారుడికి లక్షన్నర రూపాయల రుణం ఇచ్చారు. అనంతరం అక్కడ నుండి ఖాతాదారుడు వెళ్లిపోయాడు. అక్కడ నుండి మరో ఫైనాన్స్ సంస్థకు వద్దకు అదే ఖాతాదారుడు వెళ్లాడు. బంగారు ఆభరణాలపై రుణం కావాలని అడిగాడు. సరేనన్న సిబ్బంది ఆభరణాలను తీసుకున్నారు. వాటిని చెక్ చేశారు. అయితే అనుమానంవచ్చిన ఫైనాన్స్ సిబ్బంది వాటిని ఆధునిక పద్దతుల్లో పరీక్షించగా అవి నకిలీవని తేలింది. వెంటనే ఖాతాదారుడిని మాటల్లో పెట్టిన సిబ్బంది పొలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరొక బ్యాంక్ వద్ద కూడా ఇటువంటి ఘటనే జరిగింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిది కేరళ రాష్ట్రంగా గుర్తించారు. అయితే వీరికి సహకరించిన మరో వ్యక్త పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
అసలు మోసం ఎలా చేశారు ? సాధారణంగా బ్యాంక్ ల వద్ద అప్రైజర్ బంగారు ఆభరణాలను ఆకురాయిపై రుద్ది అవి బంగారు ఆభరణాలా కాదా అన్న అంశాన్ని తేలుస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్నముఠా బ్యాంక్ సిబ్బందిని సులభంగా బోల్తా కొట్టించవచ్చని భావించారు. దీంతో 26 గాజులను తయారు చేశారు. ఇత్తడితో తయారు చేసిన వాటికి బంగారపు పూత పూశారు. దీంతో అవి చూడటానికి అచ్చం బంగారు గాజుల్లానే ఉన్నాయి. అంతేకాకుండా ఆకురాయిపై రుద్దినప్పుడు కూడా బంగారు కోటింగ్ వలన అవి నిజమైన బంగారు ఆభరణాలుగానే భ్రమపడతారు.
అదే విధంగా ఒక బ్యాంక్ లో సిబ్బందిని బురిడీ కొట్టించి లక్షన్నర రుణం తీసుకున్నారు. మరో రెండు చోట్ల మాత్రం దొరికి పోయారు. ఈ విషయం వెలుగుచూడటంతో బ్యాంక్ ల్లోని సిబ్బంది, మేనేజర్లు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంకావటంతో అనేక మంది రైతులు బంగారు ఆభరణాలపై రుణాలు పొందేందుకు పెద్ద ఎత్తున బ్యాంక్‌ల వద్ద వేచి ఉంటున్నారు. ఇదే సమయంలో నకిలీ ఆభరణాల ముఠాలు సంచరిస్తున్నాయని తెలియడంతో కలకలం రేగింది. మొత్తానికి పోలీసులు అదుపులో ఉన్న ఇద్దరి వద్ద నుండి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా బంగారు ఆభరణాల మీద రుణం తీసుకోవడానికి ఎవరైన బ్యాంకుకు వస్తే వాటిని ఆధునిక పద్దతుల్లో పరీక్షించాలని పోలీసులు కోరుతున్నారు. ఎవరైనా నకిలీ బంగారాన్ని తీసుకొస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
