ట్రంప్ మిస్సింగ్.. దెబ్బకు జబ్బు పట్టిందా..? అమెరికా అంతా ఒకటే టెన్షన్..!
ట్రంప్ మిస్సింగ్.. అవును ట్రంప్ కనబడుట లేదు. పోస్టర్లు వేయలేదన్న మాటే గానీ ఆయన ఏమైపోయారని అమెరికా అంతా ఒకటే టెన్షన్. వేర్ ఈజ్ ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ట్యాగ్స్. యుద్ధాలన్నీ తానే ఆపానని చెప్పుకునే ప్రపంచ శాంతిదూతకి ఏమైంది? అన్న చర్చ మొదలైంది.

ట్రంప్ మిస్సింగ్.. అవును ట్రంప్ కనబడుట లేదు. పోస్టర్లు వేయలేదన్న మాటే గానీ ఆయన ఏమైపోయారని అమెరికా అంతా ఒకటే టెన్షన్. వేర్ ఈజ్ ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ట్యాగ్స్. యుద్ధాలన్నీ తానే ఆపానని చెప్పుకునే ప్రపంచ శాంతిదూతకి ఏమైంది? అన్న చర్చ మొదలైంది.
ఆరోగ్యంగానే ఉన్నారా..? అందుకే రెస్ట్‌లో ఉన్నారా..? కనిపించకున్నా వార్తల్లో ట్రంప్ హడావిడి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన చేతికి గాయాలతో కనిపించటంతో ఇప్పుడు మిస్సింగ్‌కి అనారోగ్యమే కారణమనే ప్రచారం మొదలైంది. నేను మునిగినా అందరినీ ముంచుతాననే ట్రంప్ ఎందుకో మీడియా ముందుకు రావడం లేదు. ఏ మెసేజ్ అయినా తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు.
ఆగస్టు 30, 31 తేదీల్లో వైట్‌హౌస్‌లో ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. అసలేం జరుగుతోందని సోషల్ మీడియా ఎక్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని మరికొందరు అంటున్నారు. సెప్టెంబరు 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.
79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతికి కమిలిన గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతిని కవర్ చేసుకుని కనిపించారు. తరచూ కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందన్న ఆయన వ్యక్తిగత వైద్యుడు.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఏది చెప్పాలన్నా నిమిషాల్లో మీడియా ముందుకొచ్చే ట్రంప్.. రెండ్రోజుల నుంచీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ వారికి ఏమైందంటూ చర్చ మొదలైంది.
Discoloration spotted again on the back of Trump’s hand. This was taken at his Virginia golf club this weekend. pic.twitter.com/moRErdeHug
— PatriotTakes 🇺🇸 (@patriottakes) August 18, 2025
న్యూజెర్సీలో ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చినప్పుడు ట్రంప్ కాస్త నలతగా కనిపించారు. కాళ్ల దగ్గర నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. తర్వాత కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే కనిపించడంతో ఆయన మిస్సింగ్‌తో లింక్ పెడుతూ ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ట్రంప్ అనారోగ్యం వార్తల వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ట్రంప్ మిస్సింగ్‌కి, జేడీ వాన్స్ కామెంట్స్‌కి కూడా కొందరు ముడిపెడుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతోగానీ ట్రంప్ మళ్లీ కనిపిస్తేగానీ అనుమానాలకు తెరపడేలా లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
