కనీస అవసరాలు తీర్చలేదని విడాకులిచ్చిన భార్య.. కట్‌చేస్తే కోటీశ్వరుడైన భర్త.. ఏం జరిగిందంటే..!
ఇటీవల కాలంలో వివాహబంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు కొంతమంది. ఆర్ధిక సమస్యలు, మనస్పర్థలతో కలిసి జీవించలేకపోతున్నారు. అలా పెళ్లైన దగ్గర నుంచి కనీస అవసరాలు కూడా తీర్చడంలేదని, భర్తతో గొడవపడి వదిలి వెళ్లిపోయింది భార్య. కట్‌చేస్తే కొన్ని రోజుల్లోనే అతను కోటీశ్వరుడయ్యాడు.

ఇటీవల కాలంలో వివాహబంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు కొంతమంది. ఆర్ధిక సమస్యలు, మనస్పర్థలతో కలిసి జీవించలేకపోతున్నారు. అలా పెళ్లైన దగ్గర నుంచి కనీస అవసరాలు కూడా తీర్చడంలేదని, భర్తతో గొడవపడి వదిలి వెళ్లిపోయింది భార్య. కట్‌చేస్తే కొన్ని రోజుల్లోనే అతను కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. కటిక దరిద్రుడిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేస్తుంది. అదే జరిగింది అమెరికా న్యూజెర్సీకి చెందిన మైక్ వీర్‌న్కీ విషయంలో.. పదిహేనేళ్ల క్రితం పెళ్లయిన మైక్ సరైన ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ భార్య అతనితో గొడవపడేది. కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని, తనను ఎప్పుడూ బయటకు కూడా తీసుకెళ్లడం లేదని గొడవ పడేది. చివరికి విసిగిపోయిన ఆమె, నీతో కలిసి జీవించలేనని విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.
తన పరిస్థితిని తలచుకుని నిస్సహాయంగా ఉండిపోయిన మైక్‌ని కొన్ని రోజులకే అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో ధనలక్ష్మి హగ్ చేసుకుంది. మైక్ వీర్‌న్కీ సరదా కొనుగోలు చేసిన లాటరీ అతని పంట పండించింది. లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా 2,280 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భార్య వదిలి వెళ్లిపోయిన తర్వాత మైక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మైక్‌కి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఎప్పటికైనా తనను అదృష్టం వరించకపోతుందా అని తరచూ లాటరీ టికెట్లు కొంటుంటాడు. అతని ఆశ నెరవేరింది. తాను కొన్న ఓ లాటరీ టికెట్‌కు 273 మిలియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.2,280 కోట్లు. దీంతో దెబ్బకు దశ తిరిగింది. అతని పేదరికం వదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మైక్ డబుల్ జాక్‌పాట్ కొట్టాడని కొందరు, ఇప్పుడు నీ భార్య నీదగ్గరకు తప్పక తిరిగి వస్తుందని మరికొందరు కామెంట్లు చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
