Birth day: పుట్టినరోజు కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారులో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని పుట్టిన రోజు జరుపుకునే వారితో కేక్ పై ఉన్న క్యాండిల్‌ను అర్పించి దాన్ని కట్ చేయించడం చేస్తారు. అయితే ఇలా క్యాండిల్ ఆర్పి, కేక్ కట్‌చేయడం అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకు పుట్టినరోజు కొవ్వత్తులు ఎందుకు వెలిగిస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా.. అయితే ఇప్పుడు తెలసుకుందాం.
Updated on: Aug 31, 2025 | 3:47 PM

పుట్టిన రోజున కేక్ కట్ చేయడం అనే సాంప్రదాయం. మధ్యయుగంలో జర్మనీలో ఉద్భవించింది. 1746లో మతపరమైన సామాజిక సంస్కర్త జిన్‌జెండార్ఫ్ పుట్టినరోజున సందర్భంగా రకమైన వేడుక జరిగినట్లు చరిత్ర చెబుతుంది.

కేక్ కట్ చేసి సంప్రదాయం జర్మనీ నుంచి వస్తే.. పుట్టినరోజు నాడు ఈ కొవ్వొత్తులను వెలిగించే ఆచారం మాత్రం గ్రీస్ నుంచి ఉద్భవించినట్టు తెలుస్తోంది. గ్రీకులు తమ ఇష్టదైవమైన ఆర్టెమిస్ దేవతను ఎక్కువగా పూజించేవారు. ఈ క్రమంలో ఆమెకు నైవేద్యాలు సమర్పించడానికి వారు గుండ్రిని కేసుపై వెలిగించిన కొవ్వొత్తులను ఉపయోగించేవారు.

అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. గ్రీకులు తమ ఆరాద దైవానికి నైవేద్యం సమర్పించి, దేవతలను ప్రార్థించిన తర్వాత, కేకుపై ఉన్న కొవ్వత్తులను వారు ఆర్పేసేవారు. ఆ కొవ్వత్తుల నుంచి వచ్చే పొగ వారు కోరుకునే కోరికలను దేవతలకు చేరవేస్తుందని వారంతా నమ్మేవారు. పుట్టిన రోజు నాడు కూడా వేడుక జరుపుకునే కేక్ కట్ చేసి క్యాండిల్‌ను ఆర్పి తమ కోరికలను దేవతలకు తెలియజేవారు.

ఇదిలా ఉండగా, భారతదేశంలో కేకు కట్‌చేయడం, కొవ్వొత్తులను ఊదడం పురాతన కాలంలో ఒక సంప్రదాయం కాదు. కానీ పాశ్చాత్య దేశాల ప్రభావం కారణంగా, ఈ సంప్రదాయం భారతదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ కేకులు కోసి తమ పుట్టినరోజులను జరుపుకుంటున్నారు.

కాబట్టి, ఇప్పట్లో పుట్టినరోజు అంటే కేక్ కట్ చేయడం, కొవ్వొత్తులను ఆర్పడం, బహుమతులు స్వీకరించడం, పార్టీ చేసుకోవడం. కానీ దాని మూలాలు మత విశ్వాసాలు, సామాజిక ఆచారాలు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం నుండి అభివృద్ధి చెందాయని చాలా మందికి తెలియదు. పురాతన గ్రీస్‌లో ప్రారంభమైన కొవ్వొత్తులను వెలిగించే ఈ సంప్రదాయం, జర్మనీలో పుట్టినరోజు కేక్ కట్ చేసే సంప్రదాయం అన్నీ కలిసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పుట్టినరోజు సంప్రదాయాన్ని ఏర్పరిచాయి.




