విషాదం నింపిన సరదా.. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి..!
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న మోన్రో సరస్సులో ఈతకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు భారత్‌కు చెందిన వారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఏప్రిల్ 15న సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు తమ స్నేహితులతో కలిసి ఇండియానా పోలీస్‌కు దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో..
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న మోన్రో సరస్సులో ఈతకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు భారత్‌కు చెందిన వారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఏప్రిల్ 15న సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు తమ స్నేహితులతో కలిసి ఇండియానా పోలీస్‌కు దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోన్రో సరస్సులో బోటింగ్‌కు వెళ్లారు. బోటింగ్ సమయంలో ఒకచోట సిద్ధాంత్ షా, ఆర్యన్‌వైద్యలు ఈతకు దిగారు. ఐతే అక్కడ 35 నుంచి 40 అడుగుల లోతు ఉంది. దీంతో ఈతకు దిగిన వారిద్దరూ నీళ్లలో మునిగిపోయారు.
వారిని కాపాడటానికి స్నేహితులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వారికోసం రెండు రోజుల పాటు గాలించగా వారి మృతదేహాలు 18 అడుగుల లోతులో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఇండియానా యూనివర్సిటీ కెల్లి స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతరం మృతదేహాలను స్వదేశం పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.