Kohinoor Diamond: బ్రిటీష్ రాజకుటుంబం సంచలన నిర్ణయం.. కోహినూర్ పొదిగిన రాజ కిరీటాన్ని ధరించకూడదని.

బ్రిటీష్ రాజకుటుంబం వివాదాలకు దూరంగా ఉండేందుకు.. కెమిల్లా పార్కర్ కోహినూర్ పొదిగిన రాజ కిరీటాన్ని ధరించకూడదని నిర్ణయించుకుంది. కోహినూర్‌ను భారత్‌కు తీసుకురావాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో..

Kohinoor Diamond: బ్రిటీష్ రాజకుటుంబం సంచలన నిర్ణయం.. కోహినూర్ పొదిగిన రాజ కిరీటాన్ని ధరించకూడదని.
Kohinoor Diamond
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 23, 2023 | 10:16 PM

బ్రిటీష్ రాజకుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 6న జరిగే కింగ్ చార్లెస్ (మూడో) పట్టాభిషేకంలో అతని భార్య కెమిల్లా పార్కర్ కోహినూర్ పొదిగిన రాజ కిరీటాన్ని ధరించరాదని బ్రిటన్ రాజకుటుంబం నిర్ణయించింది. కోహినూర్‌కు సంబంధించి వివాదం తలెత్తుతుందనే భయంతో ప్యాలెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె భారతదేశ అసంతృప్తిని అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెలియజేశారు. ఈ విషయంపై, ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక అసోసియేట్ ఎడిటర్ కెమిల్లా టోమినీ, PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బ్రిటిష్ రాజకుటుంబం వివాదాల్లోకి రాకూడదని.. కెమిల్లా పార్కర్ కోహినూర్ పొడుగుచేసిన రాజ కిరీటాన్ని ధరించకూడదని నిర్ణయించుకుంది.

కోహినూర్ వివాదాస్పదమైన విషయంపై ప్యాలెస్ ఆలోచనతో ఉందని.. అందుకే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ వజ్రాల మూలం గురించి ఎలాంటి సైడ్ స్టోరీ సృష్టించడం బ్రిటిష్ రాజకుటుంబానికి ఇష్టం లేదు. విశేషమేమిటంటే, కింగ్ చార్లెస్ III , క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం మే 6న జరగనుంది.

కిరీటంలో మార్పుకు..

ప్యాలెస్ నుంచి ఒక ప్రకటన జారీ చేయడం ద్వారా.. క్వీన్ మేరీ కిరీటాన్ని మార్చడానికి సూచనలు ఇచ్చారు. క్వీన్ మేరీ కిరీటంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్యాలెస్ తెలిపింది. క్వీన్ ఎలిజబెత్ II వ్యక్తిగత ఆభరణాల సేకరణలో చాలా సంవత్సరాలుగా భాగమైన కుల్లినన్-3, 4, 5 వజ్రాలను చేర్చడం వంటివి ఇందులో ఉన్నాయి.

విశేషమేంటంటే, బ్రిటీష్ రాజకుటుంబంలోని పురుషులు కోహినూర్ శాపగ్రస్తమైందని నమ్ముతారు. కాబట్టి వారు దానికి దూరంగా ఉంటారు. కోహినూర్‌ వజ్రం తమదేనంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ క్లెయిమ్ చేస్తున్నాయి. మరోవైపు కోహినూర్‌ను భారత్‌కు తీసుకురావాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.

బ్రిటన్‌లో ఉన్న కోహినూర్‌ని… మన దేశానికి తిరిగి రప్పించాలని ఎంతో ప్రయత్నం జరుగుతోంది. అయితే.. ఆ పోరాటం ఫలించే రోజు రానే వస్తోంది. ఎలిజబెత్‌-2 కన్నుమూయడంతో…  బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం జరగనున్న సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం