Island: రూ.1.5 కోట్లు ఉంటే ఈ ద్వీపం మీ సొంతమే.. ఎక్కడంటే
ఈ కాలంలో ఓ మంచి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా లేదా కొనుక్కోవాలన్న కోటీ రూపాయల పైనే అవుతోంది. అయితే మీ దగ్గర ఓ కోటీ రూపాయల పైనే ఉంటే ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేయచ్చు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా స్కాట్‌లాండ్ లో.
ఈ కాలంలో ఓ మంచి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా లేదా కొనుక్కోవాలన్న కోటీ రూపాయల పైనే అవుతోంది. అయితే మీ దగ్గర ఓ కోటీ రూపాయల పైనే ఉంటే ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేయచ్చు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా స్కాట్‌లాండ్ లో. స్కాట్‌లాండ్ లోని దక్షిణ తీరప్రాతంలో ఈ ద్వీపం ఉంది. ఆరోన్ ఎడ్జర్ ఆఫ్ గాల్‌బ్రేయిత్ గ్రూప్ అనే సంస్థ తన అధినంలో ఉన్న ఈ ద్వీపాన్ని అమ్మేందుకు ముందుకొచ్చింది. దీని ధర లక్ష 90 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు కోటీ 50 లక్షల రూపాయలు అన్నమాట. అయితే ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుందని.. ఇక్కడికి వచ్చి ఎవరైన ఆనందంగా గడపవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రతిరోజు గడిపే బిజీబీజీ లైఫ్ నుంచి బయటకి వచ్చి ఈ అందమైన ప్రాంతంలోని కాస్త శాంతిని, ప్రశాంతతను ఆస్వాదించవచ్చని పేర్కొంది.
అయితే ఈ ద్వీపం నుంచి ఆరు మాళ్ల దూరంలోనే ఓ పట్టణం ఉంటుందని.. దగ్గర్లోని రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు రోడ్డుపై వెళ్తే గంట సమయం పడుతుంది. అలాగే ఈ ప్రాంతం నుంచి 350 మైళ్ల దూరంలో లండన్, 100 మైళ్ల దూరంలో ఎడిన్‌బర్గ్ లు ఉన్నాయి. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. సముద్రం వరకు పచ్చని గడ్డి, రాళ్లతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు కనపబడతాయి. అరుదుగా కనిపించే మొక్కలు, అలాగే సముద్ర పక్షులు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఈ ద్వీపానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని.. దీన్ని కొన్నవారు మాత్రం ఏమైన ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే డైరక్ట్‌గా స్థానిక ప్రణాళిక అధికారులతో మాట్లాడుకోవాలని గాల్‌బ్రైత్ గ్రూప్ తెలిపింది. అలాగే స్కాట్‌లాండ్ లో ప్రైవేట్ ద్వీపాలకు దేశీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటాన్ని చూశామని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..