AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lover Snoring: బాయ్ ప్రెండ్ గురకకు రికార్డ్ చేసి అమ్మి భారీగా డబ్బులు సంపాదిస్తున్న ప్రియురాలు..

లూయిస్‌కు ఒక చెడు అలవాటు ఉంది. అది రాత్రిపూట గట్టిగా గురక పెట్టడం. దీంతో అన్నా ప్రతి రాత్రి డిస్టర్బ్ అయ్యేది. ఈ విషయం మర్నాడు ఉదయం లూయిస్‌కి చెబితే.. అతను నమ్మలేదు. తాను అసలు గురక పెట్టను అని చెప్పాడు.   

Lover Snoring: బాయ్ ప్రెండ్ గురకకు రికార్డ్ చేసి అమ్మి భారీగా డబ్బులు సంపాదిస్తున్న ప్రియురాలు..
Snoring (Representative image)
Surya Kala
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 19, 2023 | 9:29 PM

Share

నిజమైన వ్యాపారస్తులు.. తన దగ్గర ఉన్న వస్తువులను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అమ్మేసే తెలివి తేటలు కలిగి ఉంటాడని అంటారు. నిద్రపోయే సమయంలో వస్తున్న గురకను అమ్మి డబ్బులు సంపాదిస్తూ.. పెద్దలు చెప్పిన ఈ మాటను నిజం చేసి చూపిస్తోంది ఓ యువతి. అవును చాలా మందికి నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక నిద్రపోతున్నవారికంటే.. వారి పక్కన ఉన్నవారికి నరకం అనిపిస్తుంది. తమ పక్కన ఉన్నవాళ్లు గురకతో నిద్రపోతుంటే.. ఆ గురక సమయంలో వచ్చే సౌండ్ తో అవతలివారు ఇబ్బంది పడతారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురక పెట్టేవాడికి దీని గురించి ఏమీ తెలియదు! అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన కథ కాస్త విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ తన ప్రియుడి పెడుతున్న గురకతో చాలా డబ్బు సంపాదిస్తోంది. ఇంతకుముందు ఈ గురకతో ఇబ్బంది పడిన ఆ యువకుడు ఇప్పుడు తన గురకతో బాగా సంపాదిస్తోంది

ఈ విషయాన్ని 26 ఏళ్ల అనా మల్ఫెయిర్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా షేర్ చేసింది.  అనా మల్ఫెయిర్ తన 33 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ లూయిస్‌తో గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరూ లివ్-ఇన్‌లో జీవించడం ప్రారంభించారు. అన్నా లూయిస్‌ని చాలా ఇష్టపడింది. అతని ప్రతి అలవాటు అన్నాతో సరితూగేది. అయితే  లూయిస్‌కు ఒక చెడు అలవాటు ఉంది. అది రాత్రిపూట గట్టిగా గురక పెట్టడం. దీంతో అన్నా ప్రతి రాత్రి డిస్టర్బ్ అయ్యేది. ఈ విషయం మర్నాడు ఉదయం లూయిస్‌కి చెబితే.. అతను నమ్మలేదు. తాను అసలు గురక పెట్టను అని చెప్పాడు.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే

ఇవి కూడా చదవండి

తాను గురక గురించి చెబితే నమ్మలేదని.. ఒకరోజు లూయిస్ గురకను రికార్డ్ చేసి, మరుసటి రోజు అతనికి ప్లే చేసి వినిపించాలని అన్నా నిర్ణయించుకుంది.  మర్నాడు తన గురక శబ్దం విని లూయిస్ చాలా సిగ్గుపడ్డాడు. అయితే అప్పటి నుంచి రోజూ రాత్రి గురక శబ్దాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించింది. ఇలా రికార్డు చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఇలా ఒక సంవత్సరం పాటు రికార్డ్ చేసింది. గురకకు సంబంధించి మంచి కలెక్షన్‌ను రూపొందించింది. తన దగ్గర ఉన్న గురక శబ్దాలను స్నేహితులైన సంగీత విద్వాంసులకు వినిపించింది అన్నా. వారిలో ఒకరు ఆమెకు ఐడియా ఇచ్చారు. Spotify లో వీటిని అప్ లోడ్  చేయమని చెప్పారు.

తన స్నేహితురాలి చెప్పిన ఆలోచనను అమలు చేస్తూ.. Spotify లో అప్లై చేసింది. ప్రజలు ఈ గురక శబ్దాన్ని చాలా ఇష్టపడ్డారు. తమ నిద్రను భంగపరిచే సంగీతంగా భావించారు. దీంతో ఇప్పుడు ఈ గురక అన్నాకు  బలమైన ఆదాయ వనరుగా మారింది. ఒకప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ పెట్టిన గురకతో ఇబ్బంది పడిన అన్నా ఇప్పుడు ఎంతో ఇష్టంగా వింటుంది. Spotify ఖాతాలోని ఈ గురక సంగీతాన్ని వింటున్న వారి సంఖ్య దాదాపు 16 వేలు వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..