AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expert in Farming: మీరు వ్యవసాయంలో దిట్ఠా. ఆ దేశంలో మంచి జీతంతో ఉద్యోగం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎందుకంటే వారి వయస్సు 65 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు 66 శాతం వ్యవసాయ ఆపరేటర్లు ఇప్పుడు వ్యవసాయం చేయడంపై ఆసక్తిని చూపించడంలేదని.. వ్యాపారాన్ని విడిచిపెట్టే ప్రక్రియలో ఉన్నారని పరిశోధనలో వెల్లడించారు.

Expert in Farming: మీరు వ్యవసాయంలో దిట్ఠా. ఆ దేశంలో మంచి జీతంతో ఉద్యోగం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Expert In Farming
Surya Kala
|

Updated on: Apr 21, 2023 | 9:48 AM

Share

ఇప్పటి వరకూ చదువుకోసం, ఉద్యోగం కోసం లేదా పర్యటన కోసం విదేశాలకు ముఖ్యంగా, అమెరికా, యూరోపియన్ కంట్రీలకు వెళ్లారు. ముఖ్యంగా మంచి విద్యనభ్యసించిన వారు అమెరికా, యూరప్లోని దేశాలకు  ఉద్యోగాల కోసం వెళతారు . దీని తరువాత కార్మికులు, సామాన్యులు వేతనాల కోసం గల్ఫ్ దేశాల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇప్పుడు రైతులు విదేశాలకు కూడా వెళ్లేందుకు మంచి అవకాశం వచ్చింది. వారు అక్కడకు వెళ్లడానికి కాదు, పని చేయడానికి వెళ్ళవచ్చు. ఇందుకోసం వారికి వ్యవసాయంపై మంచి అవగాహన ఉండాలి. దీనితో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి.

టైమ్స్ నివేదిక ప్రకారం, కెనడాలో వ్యవసాయం తెలిసిన వాళ్ళు కావాలని ప్రకటించింది. వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో చేయడం తెలిసిన 30 వేల మందకి ఇది సువర్ణావకాశం. వ్యవసాయంలో పర్ఫెక్ట్ ఆడవాళ్లు  కెనడాలో ఉద్యోగం పొందడానికి ఒక సువర్ణావకాశం ఉంది. కెనడాలో వ్యవసాయ కూలీల కొరత ఉందని RPC తాజా అధ్యయనం వెల్లడించింది. 40 శాతం వ్యవసాయ నిర్వాహకులు 2033 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడుతుంది. కెనడా చరిత్రలో దేశంలో పెద్ద సంఖ్యలో కార్మికుల కొరత ఏర్పడడం ఇదే తొలిసారి.

కెనడా భారతీయ కార్మికులను మెరుగైన కార్మికులుగా పరిగణిస్తుంది

ఇవి కూడా చదవండి

రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా ప్రకారం.. రాబోయే 10 సంవత్సరాలలో నర్సరీలు, వ్యవసాయం, గ్రీన్‌హౌస్‌లలో 24,000 మంది కార్మికుల కొరత ఏర్పడవచ్చు. ఇది వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా యొక్క పరిశోధన ప్రకారం, 60 శాతం వ్యవసాయ ఆపరేటర్లు రాబోయే 10 సంవత్సరాలలో పదవీ విరమణ చేయనున్నారు.  తల్లిదండ్రులు తమ కొడుకు,ని మాత్రమే తమ  మనవడిని వ్యవసాయ రంగంలోకి రానివ్వడం లేదు. అటువంటి పరిస్థితిలో, 66 శాతం సాగు భూమిపై సంక్షోభం ఏర్పడుతుందనే భయం నెలకొంది. పంజాబ్,  హర్యానా నుండి ప్రజలు ఇప్పటికే భారీ సంఖ్యలో  కెనడాకు వెళ్లారని, వారు అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కెనడా భారతీయ కార్మికులను మెరుగైన కార్మికులుగా పరిగణిస్తుంది.

గ్రీకల్చర్ స్పెసిఫిక్ ఇమ్మిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్

అదే సమయంలో CBC న్యూస్ నివేదికలో, అనుభవజ్ఞులైన కార్మికుల శాశ్వత నివాస మార్గాన్ని సులభతరం చేయడానికి కెనడా 2020 సంవత్సరంలో వ్యవసాయ నిర్దిష్ట ఇమ్మిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని..  ఇది ఈ సంవత్సరం మేలో ముగుస్తుందని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, కెనడా ప్రభుత్వం అగ్రికల్చర్ స్పెసిఫిక్ ఇమ్మిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.  తద్వారా వలస కార్మికుల కొరత సమస్యను అధిగమించవచ్చు.. రాబోయే రోజుల్లో దేశంలో వ్యవసాయ చేయడంలో కార్మికుల సమస్య ఉండదని ఆలోచిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..